.

వాబిసహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి నమాజులో పంక్తి వెనుక ఒంటరిగా నిలబడి నమాజు ఆచరించడాన్ని చూసినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఆ నమాజు మరలా చేయమని ఆదేశించినారు.”

[ప్రామాణికమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో ఒక వ్యక్తి పంక్తి వెనుక నిలబడి ఒంటరిగా నమాజు చేయడం చూసి, అతడిని ఆ నమాజును మరలా చేయమని ఆదేశించినారు; ఎందుకంటే ఆ విధంగా (పంక్తి విడిచి ఏకాకిగా) ఆచరించబడిన అతడి నమాజు చెల్లదు కనుక.

فوائد الحديث

ఈ హదీథులో జమాఅత్’తో నమాజు చేయడం కొరకు, ముందుగానే మస్జిదుకు వెళ్ళి మొదటి వరుసలలో చోటు సంపాదించడానికి ప్రయత్నించాలని, అలా కాకుండా పంక్తుల వెనుక ఒంటరిగా నిలబడి నమాజు ఆచరించి, తన నమాజును చెల్లకుండా చేసుకోరాదని ప్రోత్సహించబడుతున్నది.

ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైతే పంక్తుల వెనుక ఒంటరిగా నమాజు ఆచరించుటను మొదలుపెట్టి, జమాఅత్ రుకూ స్థితి నుండి లేవక ముందే వెళ్ళి పంక్తిలో కలిసిన వ్యక్తి ఆ రకాతును, నమాజును తిరిగి ఆచరించవలసిన అవసరం లేదు. ఈ విషయం అబూ బక్రహ్ (రదియల్లాహు అన్హు) హదీథు ద్వారా తెలుస్తున్నది. అలాకాక పంక్తుల వెనుక ఒంటరిగా నమాజు ఆచరించినట్లయితే అతడు దానిని తిరిగి ఆచరించాలి. వాబిసహ్ (రదియల్లాహు అన్హు) యొక్క పై హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం యొక్క సాధారణత్వం ద్వారా మనకు ఈ విషయం తెలుస్తున్నది.

التصنيفات

ఇమామ్ మరియు ముఖ్తదీల ఆదేశాలు