إعدادات العرض
“తీర్పు దినమున అల్లాహ్ మొదటి వారినుండి చివరి వారి వరకు (అందరినీ) సమీకరించినపుడు, ప్రతి ద్రోహికి ఒక జెండా…
“తీర్పు దినమున అల్లాహ్ మొదటి వారినుండి చివరి వారి వరకు (అందరినీ) సమీకరించినపుడు, ప్రతి ద్రోహికి ఒక జెండా ఎత్తబడుతుంది మరియు ఇలా చెప్పబడుతుంది: ఇది ఫలానా వ్యక్తి కుమారుడైన ఫలానా వాడు చేసిన ద్రోహం.”
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “తీర్పు దినమున అల్లాహ్ మొదటి వారినుండి చివరి వారి వరకు (అందరినీ) సమీకరించినపుడు, ప్రతి ద్రోహికి ఒక జెండా ఎత్తబడుతుంది మరియు ఇలా చెప్పబడుతుంది: ఇది ఫలానా వ్యక్తి కుమారుడైన ఫలానా వాడు చేసిన ద్రోహం.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt ئۇيغۇرچە Hausa Português മലയാളം Kurdî Nederlands Kiswahili অসমীয়া ગુજરાતી සිංහල Magyar ქართული Română ไทย मराठी ភាសាខ្មែរ دری አማርኛالشرح
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు ఇలా తెలియజేస్తునారు: సర్వోన్నతుడైన అల్లాహ్ మొదటి మరియు చివరి వారిని పునరుత్థాన దినమున (వారి ఆచరణల) లెక్కాపత్రము కొరకు సమీకరించినప్పుడు, వారు అల్లాహ్’తో లేదా ప్రజలతో తాను చేసుకున్న ఒడంబడికను, నిబంధనలను నెరవేర్చడంలో విఫలమైన ప్రతి ద్రోహికి, తన ద్రోహాన్ని బహిర్గతం చేసే ఒక సూచనను ఏర్పాటు చేస్తాడు. ఆ రోజున, అతను ఇలా పిలువబడతాడు: ‘ఇది ఫలానా వ్యక్తి కుమారుడైన, ఫలానా వ్యక్తి చేసిన ద్రోహం’, అతడి దుష్ట పనులను, ద్రోహాన్ని సమావేశ స్థలంలోని ప్రజలకు వెల్లడించడానికి అల్లాహ్ ఇలా చేస్తాడు.فوائد الحديث
ద్రోహం, వంచన అనేవి నిషేధం మరియు అది ప్రధాన పాపాలలో ఒకటి, అందుకని ఈ తీవ్రమైన ముప్పు దానిపై విధించబడింది.
తీవ్రమైన హెచ్చరికకు పాత్రమయ్యే ద్రోహం, వంచన అంటే – ఎవరైనా మీపై నమ్మకంతో, మీకు తమ ప్రాణాన్ని, తమ గౌరవాన్ని, లేదా తమకు సంబంధించిన ఏదైనా రహస్యాన్ని, లేదా తమ సంపదను అప్పగించినట్లైతే, దానికి వ్యతిరేకంగా మీరు అతనికి ద్రోహం చేసి, మీ విశ్వసనీయతపై అతని నమ్మకాన్ని దెబ్బతీయడం.
ఇమాం అల్ ఖుర్టుబి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఇది వారు చేసే పనులకు వారి సమాజంలో వారు చేసేదానికి సారూప్యంగా అరబ్బులకు ఆయన (అల్లాహ్) తరఫు నుండి వచ్చిన సందేశం. ఎందుకంటే వారు నమ్మకానికి, విధేయత కొరకు తెల్ల జెండాను, నమ్మక ద్రోహానికి నల్ల జెండాను ఎగురవేస్తారు, ఆ విధంగా ద్రోహులను నిందించడానికి, వారిని బట్టబయలు చేయడానికి. తీర్పు దినమున ద్రోహికి ఇలాగే జరుగుతుందని ఈ హదీథ్ సూచిస్తున్నది. తద్వారా తీర్పు దినమున అతడు తన ఈ లక్షణం ద్వారా గుర్తించబడతాడు మరియు అక్కడ సమీకరించబడిన వారందరి చేత ఖండించబడతాడు.“
ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథు, పునరుత్థాన దినమున ప్రజలు వారి తండుల పేరున పిలువబడతారని సూచిస్తున్నది. “ఇది ఫలాన వ్యక్తి కుమారుడైన ఫలానా వ్యక్తి చేసిన ద్రోహం” అనే మాటల ద్వారా ఇది తెలుస్తున్నది.