:

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అంత్యక్రియలు (గుసుల్) నిర్వహించి, మనుషులు జనాజాను భుజాలపై మోసినప్పుడు, అది ధర్మబద్ధంగా ఉంటే, ఇలా అంటుంది: "నన్ను ముందుకు తీసుకెళ్లండి", కానీ అది ధర్మబద్ధంగా లేకపోతే, ఇలా అంటుంది: "ఎంత దుఃఖం! వారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?" మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ దాని మాటలు వింటాయి మరియు ఒకవేళ మనిషి దానిని వినగలిగితే, అతడు స్పృహ తప్పి పడిపోతాడు.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "మరణించిన వ్యక్తిని జనాజా మీద పెట్టి, ప్రజలు భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు — ఒకవేళ ఆ వ్యక్తి సజ్జనుడైతే, తన ముందున్న ఆనందకరమైన దాన్ని చూడటం వలన, మృతదేహం ఇలా అంటుంది: "నన్ను ముందుకు తీసుకెళ్లండి!" ఒకవేళ ఆ వ్యక్తి దుష్టుడైతే, ఎదురుగా ఉన్న శిక్షను చూసి, భయంకరమైన స్వరంతో ఇలా అరుస్తుంది: "అయ్యో! నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు!" ప్రతి జీవి దాని స్వరాన్ని వింటుంది - మనిషి తప్ప. ఒకవేళ మానవుడు ఆ స్వరం వింటే, దాని తీవ్రత వలన అతను మూర్ఛపోతాడు.

فوائد الحديث

మరణించిన వ్యక్తి నీతిమంతుడైతే, ఖననం చేయబడటానికి ముందు శుభవార్తను చూస్తాడు. కానీ అవిశ్వాసిగా మరణించిన వ్యక్తి దానికి విరుద్ధంగా దుఃఖదాయకమైన స్థితిని చూస్తాడు.

మనుషులు వినలేని కొన్ని శబ్దాలను ఇతర ప్రాణులు వింటాయి, కానీ ఆ శబ్దాలను మనుషులు మాత్రం వినలేరు.

జనాజాలో మహిళలు వెళ్లకూడదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినందు వలన, మహిళల భుజాలపై కాకుండా పురుషుల భుజాలపై మాత్రమే జనాజా (శవపేటిక) మోయడాన్ని సున్నతు అనుమతిస్తున్నది.

التصنيفات

బర్జఖ్ జీవితం