“చెదిరిన జుట్టుతో, శరీరం మీద దుమ్ముతో తలుపుల దగ్గర నిలబడిన చాలామంది ప్రక్కకు నెట్టివేయబడతారు; అయితే అతడు…

“చెదిరిన జుట్టుతో, శరీరం మీద దుమ్ముతో తలుపుల దగ్గర నిలబడిన చాలామంది ప్రక్కకు నెట్టివేయబడతారు; అయితే అతడు అల్లాహ్ పేరు మీద ఏదైనా ప్రమాణం చేస్తే, అతడు దానిని నెరవేరుస్తాడు.”

అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “చెదిరిన జుట్టుతో, శరీరం మీద దుమ్ముతో తలుపుల దగ్గర నిలబడిన చాలామంది ప్రక్కకు నెట్టివేయబడతారు; అయితే అతడు అల్లాహ్ పేరు మీద ఏదైనా ప్రమాణం చేస్తే, అతడు దానిని నెరవేరుస్తాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ప్రజలలో, తలమీద జుట్టు జడలు కట్టుకుపోయి ఉండి, శరీరం దుమ్ము కొట్టుకుపోయి ఉండి, తలకు నూనెగానీ, శరీరానికి స్నానం గానీ లేకుండా ఉండేవాళ్లు కూడా ఉన్నారు. వారికి ప్రజల దృష్టిలో హోదా ఉండదు, ఒక స్థాయి ఉండదు, మరియు వారు తలుపుల దగ్గరినుండి దూరంగా నెట్టివేయబడతారు మరియు ధిక్కారంతో తిరస్కరించబడతారు. అయితే, వారు ప్రమాణం చేస్తే, అల్లాహ్ వారి గౌరవార్థం దానిని నెరవేరుస్తాడు, వారి అభ్యర్థన మంజూరు చేయబడుతుందని నిర్ధారిస్తాడు మరియు అల్లాహ్ వద్ద వారి ఈమాన్ (విశ్వాసము) మరియు హోదా కారణంగా వారు తాము చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించకుండా వారిని రక్షిస్తాడు.

فوائد الحديث

అల్లాహ్ తన దాసుల బాహ్య స్వరూపాన్ని చూడడు; ఆయన వారి హృదయాలను మరియు ఆచరణలను చూస్తాడు.

ఒక వ్యక్తి తన శరీరము మరియు దుస్తుల కంటే తన కర్మలకు మరియు హృదయ స్వచ్ఛతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.

అల్లాహ్ పట్ల వినయం మరియు విధేయత అనేవి ప్రార్థనలకు, దుఆలకు సమాధానం లభించడానికి కారణాలు. కాబట్టి, మహిమాన్వితుడైన అల్లాహ్ భయభక్తులు కలిగిన భక్తిపరులు మరియు వినయస్థుల ప్రమాణాలను నెరవేరుస్తాడు.

ప్రజలు ఒకరినొకరు తృణీకరించుకోకుండా ఉండటానికి (వారి మధ్య సత్సంబంధాలు ఉండాలని) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు వివరిస్తున్నాయి.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు