“చూడండి, నిశ్చయంగా ఈ ప్రపంచం శపించబడింది, మరియు దానిలో ఉన్న ప్రతిదీ కూడా; కేవలం అల్లాహ్ స్మరణ, మరియు దానికి…

“చూడండి, నిశ్చయంగా ఈ ప్రపంచం శపించబడింది, మరియు దానిలో ఉన్న ప్రతిదీ కూడా; కేవలం అల్లాహ్ స్మరణ, మరియు దానికి అనుగుణంగా ఉన్నది; ఒక పండితుడు మరియు ఙ్ఞానసముపార్జన చేయు వాడు (విద్యార్థి) తప్ప.”

అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “చూడండి, నిశ్చయంగా ఈ ప్రపంచం శపించబడింది, మరియు దానిలో ఉన్న ప్రతిదీ కూడా; కేవలం అల్లాహ్ స్మరణ, మరియు దానికి అనుగుణంగా ఉన్నది; ఒక పండితుడు మరియు ఙ్ఞానసముపార్జన చేయు వాడు (విద్యార్థి) తప్ప.”

[ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: “ఈ ప్రపంచాన్ని మరియు దానిలోని ప్రతిదానిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు; నిందార్హమైనదిగా భావిస్తాడు; విడిచి పెట్టదగినదిగా, దూరంగా ఉంచదగినదిగా భావిస్తాడు; అందులో ఉన్న ప్రతిదీ విడిచి పెట్టదగినది మరియు ఎంతమాత్రమూ ప్రసంసార్హమైనది కాదు. ఎందుకంటే ప్రపంచం మరియు దానిలోని ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి దృష్టి మరల్చి, ఆయన నుండి దూరం చేస్తుంది; అయితే అల్లాహ్ స్మరణ మరియు దానికి అనుగుణంగా ఉండే మరియు దానిని పోలి ఉండే, మరియు అల్లాహ్ ఇష్టపడేవి లేదా ప్రజలకు బోధించే మతపరమైన జ్ఞానంలో ప్రావీణ్యం ఉన్న పండితుడు, లేదా అలాంటి జ్ఞానాన్ని కోరుకునే జ్ఞాన అన్వేషకుడు తప్ప.

فوائد الحديث

ఏ విధంగానైతే వేరే హదీథులలో నిషేధించ బడినదో, ఈ ప్రపంచాన్ని ఏ రూపములోనూ, ఏ రకంగానూ శపించరాదు. అయితే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ స్మరణ నుండి, ఆయన ఆరాధన నుండి, ఆయన ఆదేశాలను అనుసరించడం నుండి దూరం చేసే దానిని శపించుట అనుమతించబడినది.

ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒక ఆట మరియు వినోదమే, కేవలం అల్లాహ్ నామ స్మరణ మరియు దానికి దారి తీయునది, మరియు దానికి తోడ్పడునది తప్ప.

ఇందులో ఙ్ఞానము యొక్క ఘనత, ఙ్ఞానవంతులైన పండితుల ఘనత, మరియు ఙ్ఞానసముపార్జకుల ఘనత వివరించబడినది.

ఇబ్నె తైమియా ఇలా అన్నారు: "ఏదైతే, లేక ఏవైతే స్వభావసిద్ధంగా నిషిధ్ధమైనవో (ఉదా: దొంగతనము, మోసము మొ.); లేక అనుమతించబడినవి (హలాల్) ఐనప్పటికీ గర్వము, హోదా లేక ఇతరులకు ప్రదర్శించుట కొరకు, లేక మరొకరికి పోటీగా ఉండుటకు అనుసరించబడే విషయాలు (ఉదా: సంపద, హోదా మొ.); లేదా ప్రగల్భాల కొరకు మరియు వాదన కొరకు సంపాదించినవి మాత్రమే - ఙ్ఞానవంతులైన వ్యక్తులు అసహ్యించుకునేవి."

التصنيفات

ఇహలోక ఇష్టత ఖండన