“నేను మహిళలతో కరచాలనం చేయను. వంద మంది మహిళలకు చెప్పిన నా మాటలు ఒక మహిళకు చెప్పిన నా మాటలకు సమానం, లేదా ప్రవక్త…

“నేను మహిళలతో కరచాలనం చేయను. వంద మంది మహిళలకు చెప్పిన నా మాటలు ఒక మహిళకు చెప్పిన నా మాటలకు సమానం, లేదా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు

ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇలా ఉల్లేఖిస్తున్నారు: నేను మరియు కొందరు అన్సార్ స్త్రీలు ఒక బృందంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విధేయత ప్రతిజ్ఞ చేయుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినాము. మేము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాము: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! మేము అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించమని, దొంగతనానికి పాల్బడబోమని, వ్యభిచారానికి పాల్బడము అని, మా చేతులకు, కాళ్ళకు మధ్య కల్పించిన ఏ అబధ్ధాన్ని పలుకము అని మరియు ఏ మంచి విషయం లోనూ మేము మీకు అవిధేయత చూపము అని మీకు విధేయత ప్రకటిస్తున్నాము”; అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “(మీకు) సాధ్యపడినంత వరకు మరియు భరించగలిగినంత వరకు” అన్నారు. ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా అన్నారు “మేము ఇలా అన్నాము: “అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాపై (స్త్రీలపై) ఎక్కువ కరుణామయులు; రండి ఓ రసూలుల్లాహ్ మిమ్మల్ని మీ చేతిపై ప్రమాణం చేయనివ్వండి”. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను మహిళలతో కరచాలనం చేయను. వంద మంది మహిళలకు చెప్పిన నా మాటలు ఒక మహిళకు చెప్పిన నా మాటలకు సమానం, లేదా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఒక మహిళకు చెప్పిన నా మాటలు.."

[దృఢమైనది]

الشرح

ఈ హదీథులో ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇలా వివరించినారు: ఆమె కొందరు అన్సారు స్త్రీలతో కలిసి విధేయతా ప్రమాణం చేయడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చినారు. తాము అల్లాహ్’కు ఎవరినీ సాటి కల్పించము అని, దొంగతనానికి పాల్బడము అని, వ్యభిచారానికి పాల్బడము అని, తమ చేతులకు, కాళ్ళకు మధ్య కల్పించిన ఏ అబధ్ధాన్ని పలుకము అని, అలాగే మరియు ఏ మంచి విషయం లోనూ తాము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిపై ప్రతిజ్ఞ చేయాలని. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీకు సాధ్యపడినంత వరకు మరియు మీరు భరించగలిగినంత వరకు” (ఆమె ఇలా అన్నారు) “దానికి మేము ఇలా అన్నాము: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మా పట్ల (స్త్రీల పట్ల) అత్యంత దయామయులు. రండి ఓ ప్రవక్తా! ఏవిధంగానైతే మగవారు మీ చేతిపై చేయి వేసి ప్రతిజ్ఞ చేసినారో అలా మిమ్మల్ని కూడా ప్రతిజ్ఞ చేయనివ్వండి.” అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను స్త్రీలతో కరచాలనం చేయను. నామాటలు మరియు విధేయతా ప్రతిజ్ఞలు వందమంది స్త్రీలకు చేసినా ఒక స్త్రీకి చేసినా సమానమే.

فوائد الحديث

ఈ హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్త్రీలతో విధేయతా ప్రమాణం ఏ విధంగా తీసుకునేవారూ తెలియుచున్నది.

పరాయి స్త్రీలతో (మహ్రమ్ కాని స్త్రీలతో) కరచాలనం చేయడం నిషేధం.

షరీఅతు విధించిన బాధ్యతలు సామర్థ్యం మరియు శక్తి ఆధారంగానే ఉంటాయి.

التصنيفات

పురుషునికి మరియు స్త్రీకి మధ్య సంబంధం