“ఒక విశ్వాసి తన ధర్మం యొక్క విశాలత్వములోనే (అంటే స్వేచ్ఛగా) ఉంటాడు, అతడు అధర్మంగా (చట్టవిరుద్ధంగా) ఎవరి రక్తమైనా…

“ఒక విశ్వాసి తన ధర్మం యొక్క విశాలత్వములోనే (అంటే స్వేచ్ఛగా) ఉంటాడు, అతడు అధర్మంగా (చట్టవిరుద్ధంగా) ఎవరి రక్తమైనా చిందించనంతవరకు.”

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఒక విశ్వాసి తన ధర్మం యొక్క విశాలత్వములోనే (అంటే స్వేచ్ఛగా) ఉంటాడు, అతడు అధర్మంగా (చట్టవిరుద్ధంగా) ఎవరి రక్తమైనా చిందించనంతవరకు.”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఒక విశ్వాసి తన సత్కార్యాల విశాలతలో, అల్లాహ్ కరుణ, మన్నింపు మరియు ఆయన క్షమాభిక్ష కొరకు ఆశతో ఉంటాడు; షరియత్ అనుమతించే ఏ కారణమూ లేకుండా అతడు చట్టవిరుద్ధంగా ఒకరిని చంపనంత వరకు. అలా చంపడం ‘కబాయిర్’లలో (ఘోరమైన పాపములలో) ఒకటి. తద్వారా అతని కర్మలు కుంచించుకుపోతాయి, ఎందుకంటే అవి ఘోరమైన పాపం మరియు హత్య అపరాధానికి పరిహారం కాలేవు.

فوائد الحديث

షరియత్ కు విరుధ్ధంగా, చట్టవిరుద్ధమైన మరియు ప్రణాళికాబద్ధమైన హత్యలు తీవ్రమైనవి, ఎందుకంటే అవి ఒక విశ్వాసిని ధర్మం యొక్క విశాలత నుండి దాని సంకుచితత్వంలోకి నెట్టివేస్తాయి.

నాలుగు రకాల వ్యక్తులను ధర్మ విరుధ్ధంగా (షరియత్’కు వ్యతిరేకంగా) చంపుట నిషేధము: 1. ఒక ముస్లిం యొక్క రక్తము. ముస్లిం యొక్క రక్తము మిగతా అన్నింటికన్నా ఉన్నతమైనది; 2. ఒక ‘ధిమ్మీ’ యొక్క రక్తము. ఇస్లామిక్ రాజ్యము లేదా దేశములో, ‘జిజ్యా’ (పన్ను) చెల్లిస్తూ, ఇస్లాం నియమాలకు లోబడి తమ ధర్మాన్ని అనుసరిస్తూ జీవించే యూదులు, క్రైస్తవులు, మరియు ఇతరులు. వీరిని ‘ధిమ్మీ’ అంటారు. ధర్మవిరుధ్ధంగా వీరి రక్తం చిందించుట (చంపుట) నిషిధ్ధము. 3. ఒక ‘ముఆహిద్’ రక్తం, అంటే మనతో శాంతి ఒప్పందం చేసుకుని, వారి స్వంత భూములలో నివసించే అవిశ్వాసులను సూచిస్తుంది ఈ పదం. ఆ ఒప్పందం ప్రకారం వారు మనతో పోరాడరు మరియు మనం వారితో పోరాడము. 4. ఒక ‘ముస్త’మిన్’ రక్తము, ముస్త’మిన్ అంటే మనతో ఎటువంటి ఒడంబడిక లేదా ఒప్పందం లేని ఒక పోరాటకర్త లేక ఒక యోధుడైన అవిశ్వాసి అని అర్థం, కానీ మనము అతనికి ఒక నిర్దిష్ట కాలం వరకు రక్షణ కల్పించి ఉంటాము; పాలకుడు లేదా అతని అధీకృత ప్రతినిధి అటువంటి అనుమతి ప్రసాదిస్తాడు. ఆ అనుమతి (పత్రము) తో అతడు ముస్లిం దేశాలలోకి ప్రవేశించవచ్చు. అటువంటి రక్షణ కల్పించబడిన వ్యక్తిని చంపుట నిషేధము.

التصنيفات

నేరాలు