“ఒక వృద్ధుని హృదయం రెండు విషయాలలో యవ్వనంగా ఉంటుంది, ప్రపంచం పట్ల అతని ప్రేమ (అంటే దాని సంపద, వినోదం మరియు…

“ఒక వృద్ధుని హృదయం రెండు విషయాలలో యవ్వనంగా ఉంటుంది, ప్రపంచం పట్ల అతని ప్రేమ (అంటే దాని సంపద, వినోదం మరియు విలాసాలు) మరియు అతని నిరంతర ఆశ

అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “ఒక వృద్ధుని హృదయం రెండు విషయాలలో యవ్వనంగా ఉంటుంది, ప్రపంచం పట్ల అతని ప్రేమ (అంటే దాని సంపద, వినోదం మరియు విలాసాలు) మరియు అతని నిరంతర ఆశ."

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఒక వృద్ధుడు వృద్ధాప్యములో పెరుగుతూ ఉంటాడు, అతని శరీరం బలహీనపడుతుంది, కానీ అతని హృదయం రెండు విషయాల పట్ల ప్రేమలో యవ్వనంగా ఉంటుంది: మొదటిది: సంపదను కూడబెట్టడం ద్వారా ఈ ప్రపంచముపై ప్రేమ; రెండవది: దీర్ఘాయువు, ఆయుర్దాయం, నిరంతర జీవితం మరియు శాశ్వతమైన ఆశలు.

فوائد الحديث

మానవులు సహజంగానే ఈ విషయాలపట్ల మొగ్గు చూపుతూ ఉంటారని ఈ హదీథు తెలియజేస్తున్నది: ఒకటి ఈ ప్రపంచముపై వ్యామోహము, ప్రేమ, రెండవది ఎడతెగని ఆశ.

ఈ హదీథు ఏ విషయం లోనైనా అతిగా ఆశలు పెట్టుకోవడాన్ని, సంపదను కూడబెట్టుకోవాలనే ఆతృతను ఖండిస్తున్నది. అలాగే మరణానికి సిద్ధం కావాల్సిన అవసరాన్ని, ధనవంతులు దానధర్మాలు చేయడం యొక్క ఘనతను, మరియు పేదలు స్వీయ నిగ్రహాన్ని పాటించడం లోని ఘనతను సూచిస్తున్నది.

అన్నింటిలోనూ ఆదము కుమారునికి అత్యంత ప్రియమైనది తన స్వయమే. అతను దాని శాశ్వతత్వాన్ని కోరుకుంటాడు, కాబట్టి అతను దీర్ఘాయుష్షును ఇష్టపడతాడు. అతను సంపదను ప్రేమిస్తాడు ఎందుకంటే అది శాశ్వత ఆరోగ్యం మరియు ఆనందాన్ని సమకూర్చే గొప్ప మార్గాలలో ఒకటి. తన సంపద తరిగిపోతున్నదని అతను ఎంతగా భావిస్తాడో, దాని పట్ల అతని ప్రేమ మరియు దాని శాశ్వతత్వం పట్ల అతని కోరిక అంతగా తీవ్రమవుతాయి.

التصنيفات

ఇహలోక ఇష్టత ఖండన