"నన్ను పంపబడిన ముఖ్య ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలను (మంచి స్వభావాలను) పరిపూర్ణం చేయడమే."

"నన్ను పంపబడిన ముఖ్య ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలను (మంచి స్వభావాలను) పరిపూర్ణం చేయడమే."

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నన్ను పంపబడిన ముఖ్య ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలను (మంచి స్వభావాలను) పరిపూర్ణం చేయడమే."

[ప్రామాణికమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనను అల్లాహ్ పంపిన ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలు, మంచితనాన్ని పరిపూర్ణం చేయడమేనని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వప్రవక్తల బోధనలకు కొనసాగిస్తూ, అరబ్బులలో ఉన్న మంచి స్వభావాలను (ఉదారత, ధైర్యం, మంచితనాన్ని) పూర్తిగా తీర్చిదిద్దేందుకు ఆయన పంపబడ్డారు. అరబ్బులు అప్పట్లో మంచి విషయాలను ప్రేమించేవారు, చెడు విషయాలను ద్వేషించేవారు, ఉదారత, గౌరవం, ధైర్యం వంటి లక్షణాలు ఉండేవి. కానీ, వారి నైతికతలో కొన్ని లోపాలు కూడా ఉండేవి — వంశపారంపర్యాన్ని గొప్పగా భావించడం, అహంకారం, పేదలను తక్కువగా చూడటం వంటి వాటిని శుద్ధి చేసి, పరిపూర్ణ నైతికతను స్థాపించేందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడ్డారు.

فوائد الحديث

ఉత్తమ నైతిక లక్షణాలపై ప్రోత్సాహం ఇవ్వడం, వాటికి విరుద్ధమైన వాటి నుండి వారించటం.

ఇస్లాం ధర్మంలో మంచినైతికత (అఖ్లాఖ్ హసనహ్) అత్యంత ప్రాధాన్యంతో ప్రస్తావించబడింది. ఇది ధర్మశాస్త్రపు ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి.

(ఇస్లాం ముందు అరబ్ సమాజం యొక్క అజ్ఞాన) అజ్ఞాన కాలపు ప్రజలలో కొంతమంది వద్ద మంచి నైతికతల అవశేషాలు ఉండేవి, ఉదాహరణకు — ఉదారత (దానం), ధైర్యం (వీరత్వం) తదితర మంచి లక్షణాలు. ఇస్లాం ఆ మంచి నైతికతలను మరింత పరిపూర్ణం చేయడానికి వచ్చింది.

التصنيفات

సద్గుణాలు