“కొంతమంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. వారిలో ఒక్కరితో తప్ప, తొమ్మిది మందితో…

“కొంతమంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. వారిలో ఒక్కరితో తప్ప, తొమ్మిది మందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ‘విధేయతా ప్రమాణం’ (బైఅత్) చేయించుకున్నారు. అపుడు వారు ఇలా అన్నారు: “ఓరసూలుల్లాహ్! తొమ్మిది మందితో ప్రమాణం చేయించుకున్నారు, అతడిని వదలివేసారు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనిఒంటిపై తాయత్తు ఉన్నది” అన్నారు. అతడు తన చేతిని చొక్కా లోనికి పోనిచ్చి, దానిని త్రెంచివేసాడు. తరువాత అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకున్నారు. తరువాత ఇలా అన్నారు: @“ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటారో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”

ఉఖబహ్ ఇబ్నె ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “కొంతమంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. వారిలో ఒక్కరితో తప్ప, తొమ్మిది మందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ‘విధేయతా ప్రమాణం’ (బైఅత్) చేయించుకున్నారు. అపుడు వారు ఇలా అన్నారు: “ఓరసూలుల్లాహ్! తొమ్మిది మందితో ప్రమాణం చేయించుకున్నారు, అతడిని వదలివేసారు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనిఒంటిపై తాయత్తు ఉన్నది” అన్నారు. అతడు తన చేతిని చొక్కా లోనికి పోనిచ్చి, దానిని త్రెంచివేసాడు. తరువాత అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకున్నారు. తరువాత ఇలా అన్నారు: “ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటారో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”

[ప్రామాణికమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

కొద్ది మంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది, వారు మొత్తం పది మంది ఉన్నారు. ఆయన వారిలో తొమ్మిది మంది నుండి ఇస్లాం పట్ల విధేయత చూపాలని, ఆయనను అనుసరించాలని విధేయతా ప్రమాణం తీసుకున్నారు. కాని పదవ వ్యక్తి నుండి ప్రమాణం తీసుకోలేదు. దీని వెనుక ఉన్న కారణం గురించి అడిగినప్పుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అతడు దిష్టి తగలకుండా ఉండడానికో, లేదా ఏదైనా చెడు లేదా కీడును దూరం చేయడానికో, పూసలు లేక అటువంటి దానితో చేయబడిన తాయత్తును వేలాడదీసుకునో లేక కట్టుకునో ఉన్నాడు. కాబట్టి, ఆ వ్యక్తి తాయెత్తు ఉన్న ప్రదేశంలోనికి తన చేతిని పోనిచ్చి, దానిని కత్తిరించి, దానిని వదిలించుకున్నాడు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని విధేయతా ప్రతిజ్ఞను అంగీకరించి, తాయెత్తులకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ దానికి సంబంధించిన ఆదేశాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నారు: “ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటాడో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”

فوائد الحديث

ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ఆధారపడతాడో, అల్లాహ్ అతనికి అతను ఉద్దేశించిన దానికి విరుద్ధంగా ఇస్తాడు.

చెడును లేదా కీడును దూరం చేయడానికి ‘తాయత్తు’ ఒక సాధనం అని విశ్వసించినట్లయితే అది ‘షిర్క్ అస్సఘీర్’ (చిన్నపాటి బహుదైవారాధన) అవుతుంది; అలాకాక తాయత్తు స్వయంగా చెడును లేదా కీడును దూరం చేస్తుంది అని విశ్వసించినట్లైయి అది ‘షిర్క్ అక్బర్’ (పెద్ద బహుదైవారాధన) అవుతుంది.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్