సాధారణ విషయాల దుఆలు

సాధారణ విషయాల దుఆలు

1- “ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు”

7- గాలిని దూషించకండి (తిట్టకండి). మీకు ఇష్టము లేని గాలి (ఉదాహరణకు — బలమైన తుఫాను, గాలి దుమారము వంటిది) చూస్తే, ఇలా వేడుకోండి: ‘ఓ అల్లాహ్! ఈ గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకొచ్చే మంచి కోసం, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన మంచి కోసం మేము నిన్ను వేడు కుంటున్నాము. ఈ గాలిలో ఉన్న దుష్టత (చెడుల) నుండి, అది తీసుకొచ్చే చెడు నుండి, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన చెడు నుండి మేము నీ శరణు వేడు కుంటున్నాము

8- నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ముక్కుమీద మట్టి కొట్టుకు పోవుగాక! అతడి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నా, వారు అతడిని స్వర్గంలో ప్రవేశింపజేయకపోతే (వారికి సేవలు చేయడం ద్వారా పుణ్యాలు సంపాదించి స్వర్గంలో ప్రవేశం పొందలేకపోయిన), ఆ వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక!