إعدادات العرض
1- రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సమీపించినప్పుడు, ఆయన చివరిగా ముఖ్యమైన ఉపదేశం చేసినారు: "@నమాజును (సలాత్) పాటించండి, మీ కుడి చేయి కలిగి ఉన్న వారిని (మీ ఆధీనంలో ఉన్న మీ సేవకులను, బానిసలను) దయగా చూడండి*. నమాజును పాటించండి, మీ ఆధీనంలో ఉన్న వారిని దయగా చూడండి." రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో కూడా ఆయన గుండెలో ఈ మాటలు ప్రతిధ్వనించాయి, ఆయన నాలుక మీద కూడా ఈ పదాలు చివరి వరకు వినిపించాయి.