తయమ్ముమ్

తయమ్ముమ్

1- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో పని మీద నన్ను మరొక ప్రదేశానికి పంపినారు. అక్కడ నేను “జనాబత్” స్థితికి (గుసుల్ తప్పనిసరిగా ఆచరించవలసిన స్థితికి) లోనయ్యాను. అక్కడ నీళ్ళు దొరకలేదు. దానితో నేను మట్టిలో జంతువు పొర్లిన విధంగా పొర్లాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను ఆయనకు జరిగిన విషయాన్ని చెప్పాను. అపుడు ఆయన ఇలా అన్నారు: @“నీవు నీ రెండు చేతులతో ఇలా చేస్తే సరిపోయేది” అని ఆయన తన రెండు చేతులను భూమిపై ఒకసారి చరిచినారు, తరువాత తన ఎడమ చేతితో కుడి చేతి వెనుక భాగాన్ని, అలాగే కుడి చేతితో ఎడమ చేతి వెనుక భాగాన్ని, తరువాత ముఖాన్ని మసాహ్ చేసినారు.