"ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో…

"ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు."

అబూ అబ్దుల్లాహ్ అల్ జదలియ్యి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావం, గుణగణాల గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హును ప్రశ్నించగా, ఆమె ఇలా సమాధానము ఇచ్చినారు: "ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు."

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్వభావం గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా చెప్పినారు, "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావంలో అసభ్యత, అశ్లీలత ఉండేది కాదు. ఆయన మాటల్లో, పనుల్లో అసభ్యత, దుర్వినియోగం, ఆడంబరత ఉండేది కాదు. ఆయన ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు కాదు. అంతే కాదు, సంతల్లో (బజార్లలో) బిగ్గరగా, గొడవగా అరిచేవారు కాదు. తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు; కాని మంచితోనే ప్రతిస్పందించేవారు. తన హృదయంలోనూ క్షమించేవారు, బయట కూడా మన్నించేవారు, అలాంటి (చెడు చేసిన) వారిని పట్టించు కోకుండా దూరంగా ఉండేవారు."

فوائد الحديث

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నత స్వభావం కలిగి ఉండటం మరియు చెడు నడవడికల నుండి ఆయన దూరంగా ఉండటం అనే విషయం యొక్క వివరణ.

మంచి స్వభావాలను అలవర్చుకోవడంపై ప్రోత్సాహం, చెడు స్వభావాలకు దూరంగా పెట్టాలనే హెచ్చరిక

అశ్లీలమైన మాటలు మరియు చెడ్డ మాటలు మాట్లాడటాన్ని నిందించడం.

ఇస్లాం ధర్మంలో గొంతెత్తి మాట్లాడడం, అరవడం తప్పు

చెడు చేసినవారికి మంచి చేయడం, వారిని క్షమించటం, మన్నించటంపై ప్రోత్సాహం

التصنيفات

సద్గుణాలు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన్నింపు