ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు ఏడు పనులు చేయమని ఆదేశించినారు, అలాగే ఏడు పనులు చేయవద్దని…

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు ఏడు పనులు చేయమని ఆదేశించినారు, అలాగే ఏడు పనులు చేయవద్దని నిషేధించినారు

బరా ఇబ్నె ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు ఏడు పనులు చేయమని ఆదేశించినారు, అలాగే ఏడు పనులు చేయవద్దని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మమ్ములను - రోగిని పరామర్శించాలి అని; మరణించినవారి శవయాత్రలో పాల్గొనాలి అని; తుమ్మినవాడు "అల్హమ్దులిల్లాహ్" అన్నప్పుడు "యర్హముకల్లాహ్" అని చెప్పాలి అని; చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి, అలాగే ఎవరైనా ప్రమాణం చేస్తే, అది నిజం అయ్యేలా సహాయం చేయాలి; అణచివేయబడిన వారికి మద్దతు ఇవ్వాలి, ఎవరైనా ఆహ్వానించినట్లైతే ప్రతిస్పందించాలి (స్వీకరించాలి); ‘సలాం’ను విస్తరింపజేయాలి అని ఆదేశించినారు. అలాగే మాకు ఈ విషయాలు నిషేధించినారు – పురుషులు బంగారు ఉంగరాలు ధరించరాదని; వెండి పాత్రలలో త్రాగరాదని; ‘అల్-మయాథీర్’; ‘ఖస్సీ’; ‘అల్-ఇస్తబ్రక్’ మరియు ‘అల్-దిబాజ్’ లను ఉపయోగించరాదు అని నిషేధించినారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లింలకు ఏడు పనులు చేయాలని ఆజ్ఞాపించారు మరియు ఏడు పనులు చేయకూడదని నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేయమని ఆదేశించినవి: మొదటిది: రోగగ్రస్తులై ఉన్న వారిని పరామర్శించాలి; రెండవది: మృతుడిని ఖననం చేయడానికి తీసుకుని వెళుతున్నపుడు ఆ శవయాత్రను అనుసరించాలి; మృతుని అంత్యక్రియల నమాజులో (సలాతుల్ జనాజహ్ లో) పాల్గొనాలి, అతడి ఖనన ప్రక్రియలో పాల్గొనాలి మరియు మృతుని కొరకు దుఆ చేయాలి. మూడవది: తుమ్మి అల్లాహ్’ను ‘అల్’హందులిల్లాహ్’ అని స్తుతించే వ్యక్తి కోసం, ‘యర్హకుముల్లాహ్’ ("అల్లాహ్ నిన్ను కరుణించుగాక") అని ప్రార్థించడం. నాలుగవది: ప్రమాణం చేసిన వ్యక్తి ప్రమాణం నెరవేర్చడం మరియు అతనిని విశ్వసించడం; అంటే, ఎవరైనా ఏదైనా విషయం గురించి ప్రమాణం చేస్తే మరియు మీరు దానిని నిజం చేయగలిగితే, మీరు అలా చేయాలి, తద్వారా అతను తను ప్రమాణాన్ని నెరవేర్చలేక పోయినందుకు ఆచరించవలసిన ప్రాయశ్చిత్తం చేయవలసిన అవసరం లేదు. ఐదవది: అణచివేయబడిన వ్యక్తికి సహాయం చేయడం ద్వారా అతనికి మద్దతు ఇవ్వడం మరియు దౌర్జన్యపరుడైన వ్యక్తి అతనికి కలిగించే ఏదైనా హానిని మీ సామర్థ్యం మేరకు నిరోధించడం. ఆరవది: విందు భోజనపు ఆహ్వానాన్ని అంగీకరించడం, ఉదాహరణకు: వివాహ విందు, అఖీఖా (కొత్త శిశువు పుట్టిన తర్వాత జంతువును జిబహ్ చేసి ఇచ్చే విందు) లేదా ఇలాంటి ఇతర సందర్భాలలో భోజనానికి ఆహ్వానించినట్లైతే దానిని అంగీకరించడం. ఏడవది: ‘సలాం’ ను (శాంతి శుభాకాంక్షలను) వ్యాప్తి చేయడం, ‘సలాం’ చేయడం మరియు దానికి ప్రతిస్పందించడం. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధించినవి: మొదటిది: బంగార ఉంగరాలు ధరించడం మరియు వాటితో మిమ్మల్ని మీరు అలంకరించుకోవడం. వెండి పాత్రలో లేదా వెండి పాత్ర నుంచి త్రాగడం. మూడవది: మయాథిర్ మీద కూర్చోవడం, అవి గుర్రపు జీనులపై మరియు ఒంటె జీనులపై పరచబడే దుప్పట్లు. ఇవి పట్టుతో తయారు చేయబడతాయి. (ఇవి విలాసవంతమైన జీను కుషన్లు, పట్టుతో తయారు చేయబడి, ఎంబ్రాయిడరీతో అలంకరించబడి, ఆనాటి సమాజంలో ఉన్నతవర్గాల ఆడంబరాన్ని సూచించేవిగా ఉండేవి) నాల్గవది: పట్టు కలిపిన నారతో చేసిన వస్త్రాన్ని ధరించడం, దీనిని "అల్’ఖస్సీ" అని పిలుస్తారు. ఐదవది: పురుషులు శుద్ధ పట్టు వస్త్రాలు (పూర్తిగా పట్టుతో తయారు చేసిన వస్త్రాలు) ధరించటం. ఆరవది: ‘ఇస్తబ్రక్’ను ధరించడం. ఇది మందపాటి పట్టుతో తయారు చేయబడే వస్త్రము. ఏడవది: ‘అల్-దిబాజ్’ ను ధరించడం. ఇది పట్టులో (సిల్క్ లో) అత్యుత్తమ మరియు అత్యంత విలువైన పట్టు రకం.

فوائد الحديث

ఈ హదీథు మనకు క్లుప్తంగా ఒక ముస్లింకు తన ముస్లిం సోదరునిపై ఉండే హక్కులను తెలియజేస్తున్నది.

ప్రాథమిక సూత్రం ఏమిటంటే షరియత్’లో ప్రస్తావించబడిన అన్ని ఆదేశాలు పురుషులకు మరియు స్త్రీలకు సమానంగా వర్తిస్తాయి; అయితే కేవలం పురుషులకు లేదా కేవలం స్త్రీలకు ప్రత్యేకంగా వర్తించేవి తప్ప.

స్త్రీలు జనాజాను అనుసరించటం నిషేధము అనే విషయంపై ఇతర హదీసులు సూచిస్తున్నవి.

స్త్రీకి బంగారం మరియు పట్టు ధరించే అనుమతి ఉందని ఇతర హదీస్‌లు సూచిస్తున్నాయి.

التصنيفات

ధర్మ పద్దతులు, జనాజాను ఎత్తటం మరియు దానిని ఖననం చేయటం