స్వర్గంలో అర్-రయ్యన్ అనే ద్వారం ఉంది, మరియు ఉపవాసాలు పాటించేవారు పునరుత్థాన దినమున దాని గుండా ప్రవేశిస్తారు…

స్వర్గంలో అర్-రయ్యన్ అనే ద్వారం ఉంది, మరియు ఉపవాసాలు పాటించేవారు పునరుత్థాన దినమున దాని గుండా ప్రవేశిస్తారు మరియు వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించరు

సహ్ల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "స్వర్గంలో అర్-రయ్యన్ అనే ద్వారం ఉంది, మరియు ఉపవాసాలు పాటించేవారు పునరుత్థాన దినమున దాని గుండా ప్రవేశిస్తారు మరియు వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించరు. (ఆ దినమునాడు) 'ఉపవాసాలు పాటించేవారు ఎక్కడ?' అని అనబడుతుంది. వారు లేస్తారు, వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించరు. వారి ప్రవేశం తర్వాత ద్వారం మూసివేయబడుతుంది మరియు ఎవరూ దాని గుండా ప్రవేశించరు."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో రయ్యన్ ద్వారం అని పిలువబడే ఒక స్వర్గ ద్వారం ఉందని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేస్తున్నారు; పునరుత్థాన దినమున ఉపవాసం పాటించేవారు దాని ద్వారా ప్రవేశిస్తారు, వారు తప్ప మరెవరూ ప్రవేశించరు. ఆ దినమున "ఉపవాసం పాటించేవారు ఎక్కడ?" అని పిలుపు వస్తుంది, వారు నిలబడి ఆ ద్వారం గుండా స్వర్గములోనికి ప్రవేశిస్తారు, మరెవరూ ప్రవేశించరు. వారిలో చివరి వ్యక్తి కూడా ప్రవేశించిన తర్వాత, అది మూసివేయబడుతుంది. ఇక మరెవరూ ప్రవేశించరు.

فوائد الحديث

ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథు ఉపవాసాలు పాటించే వారి ఘనతను మరియు తీర్పు దినమునాడు వారు పొందే గౌరవాన్ని నిరూపిస్తున్నది.”

స్వర్గపు ఎనిమిది ద్వారములలో ఒక ద్వారాన్ని అల్లాహ్ కేవలం ఉపవాసాలు పాటించే వారి కొరకు ప్రత్యేకించినాడు. వారందరూ ప్రవేశించిన తరువాత ఆ ద్వారం మూసివేయబడుతుంది.

స్వర్గము ద్వారములు కలిగి ఉంటుంది అనడానికి ఇదొక ప్రకటన.

అల్’సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథులో “ఉపవాసం ఉన్నవారు ఎక్కడ ఉన్నారు?” అనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాటలు, తరుచుగా ఉపవాసాలు పాటించే వారిని సూచిస్తుంది. వారిలో నీతిమంతులు, ధార్మికులూ ఉండవచ్చు, దౌర్జన్యపరులు, అన్యాయపరులు కూడా ఉండవచ్చు. ఇది క్రమం తప్పకుండా ఉపవాసం పాటించే వారి గురించి చెప్పబడింది, ఒకసారి పాటించి వదిలివేసే వారిని గురించి కాదు.

(అర్-రయ్యాన్) అంటే "దాహమును తీర్చునది" అని అర్థం, ఎందుకంటే ఉపవాసం ఉండేవారికి తరచుగా దాహం వేస్తుంది, ముఖ్యంగా వేసవిలో ఎండ వేడిమి ఎక్కువగా ఉండే రోజులలో. కాబట్టి ఉపవాసం ఉన్నవారికి ఒక బహుమానంగా, ఈ ద్వారం వారికి మాత్రమే ప్రత్యేకమైన పేరు – ‘అర్’రయ్యాన్’ - ద్వారం అని పిలువబడింది. “అర్’రయ్యాన్” అనే పదం “ఫ’లాన్’ అనే క్రియా పదం నుండి ఉత్పాదించబడినది, దీని అర్థం “దాహాన్ని తీర్చడములో సమృద్ధమైనది” అని; ఇది దాహానికి వ్యతిరేకమైనది. ఉపవాసం సమయంలో దాహం మరియు ఆకలిని భరించేవారికి ప్రతిఫలమివ్వడానికి దీనికి ఆ పేరు పెట్టారు.

التصنيفات

ఉపవాసాల ఘనత