إعدادات العرض
నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే ‘ప్రవర్తన రీత్యా* ,ఉత్తమ…
నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే ‘ప్రవర్తన రీత్యా* ,ఉత్తమ నడవడిక కలవారే’ మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చుంటారు వారుఎవరంటే ‘ఎక్కువగా నోటి దూల కలిగి ఆలోచన లేకుండా మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన’అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త ‘గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే ‘ప్రవర్తన రీత్యా ,ఉత్తమ నడవడిక కలవారే’ మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చుంటారు వారుఎవరంటే ‘ఎక్కువగా నోటి దూల కలిగి ఆలోచన లేకుండా మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన’అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త ‘గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල ئۇيغۇرچە Kurdî தமிழ் অসমীয়া Nederlands Kiswahili Hausa ગુજરાતી Magyar ქართული Română Português ไทยالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీలో మంచి ప్రవర్తన గలవారే ఈ ప్రపంచంలో ఆయనకు అత్యంత ప్రియమైనవారు మరియు తీర్పు దినాన ఆయనకు అత్యంత సన్నిహితులు అని తెలియజేశారు. మీలో చెడు ప్రవర్తన గలవారే ఈ ప్రపంచంలో ఆయన అత్యంత అసహ్యించుకునేవారు మరియు తీర్పు దినాన ఆయనకు అత్యంత దూరంగా ఉండేవారు అని కూడా ఆయన పేర్కొన్నారు; అథ్'థర్'థారూన్ అనే అరబీ పదానికి అర్థం - అతిగా మరియు అనవసరంగా మాట్లాడేవారు, సత్యం నుండి తప్పుకునేవారు; అల్ ముతషద్దిఖూన్ అనే అరబీ పదానికి అర్థం - ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించకుండా వారి మాటలు మరింత ముఖ్యమైనవిగా అనిపించేలా తమ మాటలను అతిశయోక్తి చేసేవారు. మరియు (ముతఫైహిఖూన్) గురించి; వారు ఇలా అడిగినారు: ఓ రసూలుల్లాహ్! అతిగా మాట్లాడేవారు ఎవరో మరియు ఆడంబరాలు, గొప్పలు చెప్పుకునేవారు ఎవరో మాకు అర్థమైంది, కానీ ముతఫైహిఖూన్ లు అంటే ఎవరు? దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: వారు ఇతరులను ఎగతాళి చేస్తూ, వారిని హీనంగా చూస్తూ, అహంకారంతో మాట్లాడేవారు మరియు అహంకారులు.فوائد الحديث
మంచి నైతికత (సద్గుణాలు) కలిగినవారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అత్యంత ప్రియమైనవారు, మరియు ప్రళయదినం నాడు ఆయనకు అత్యంత సమీపంగా ఉండే అవకాశం ఉన్నవారు. చెడు నైతికత కలిగినవారు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధము, భిన్నము.
మంచి నైతికత ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెంచే మార్గాల్లో ఒకటి. అయితే చెడు ప్రవర్తన దానికి వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. (అనైతికత (దుర్గుణాలు) అంటే అహంకారం, అసత్యం, అసహనం, ద్వేషం, అసభ్యత మొదలైనవి ప్రజల మధ్య విభేదాలు, ద్వేషం కలిగిస్తాయి, దూరం పెంచుతాయి.)
మంచి నైతికత, వినయం అలవరచుకోవడం ప్రోత్సహించబడింది మరియు కాఠిన్యానికి, అహంకారానికి, ఆడంబరాలకు దూరంగా ఉండమని ఆదేశించబడింది.
అతిగా మాట్లాడటం, అహంకారం, ఆడంబరం, గొప్పలు చెప్పుకోవడం మొదలైన వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించబడింది
التصنيفات
సద్గుణాలు