"ఎవరు ఇస్లాం‌ను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో,…

"ఎవరు ఇస్లాం‌ను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో, నిశ్చయంగా అతను విజయవంతుడయ్యాడు."

అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరు ఇస్లాం‌ను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో, నిశ్చయంగా అతను విజయవంతుడయ్యాడు."

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా చెప్పినారు: "ఎవరైతే తన ప్రభువు (అల్లాహ్)కు సమర్పించుకుని, ఆయన ద్వారా ఇస్లాం మార్గాన్ని పొందుతాడో, అతని అవసరాలకు సరిపడే హలాల్ జీవనోపాధి పొందుతాడో, (అధికంగానూ కాదు, తక్కువగానూ కాదు — అవసరానికి సరిపడేంత మాత్రమే), అల్లాహ్ అతనికి ప్రసాదించిన దానితో అతను సంతృప్తిగా, ఆనందంగా ఉంటాడో - అతడే నిజమైన విజేత, విజయాన్ని సాధించినవాడు."

فوائد الحديث

ఒక వ్యక్తి ఆనందం అతని ధర్మం యొక్క పరిపూర్ణత, అతని జీవనోపాధి యొక్క సమృద్ధి మరియు అల్లాహ్ అతనికి ప్రసాదించిన దానితో అతని సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది.

ఇస్లాం మరియు సున్నతులతో పాటు ఈ ప్రపంచంలో నుండి మీకు ప్రసాదించబడిన దానితో సంతృప్తి చెందడం ప్రోత్సహించబడింది.

التصنيفات

ఇహలోక ఇష్టత ఖండన