“ఖుర్’ఆన్ ను బహిరంగంగా పఠించే వాడు, బహిరంగంగా సదఖా (దాన ధర్మములు) చేసినటువంటి వాడు, ఖుర్’ఆన్ ను ఒంటరిగా…

“ఖుర్’ఆన్ ను బహిరంగంగా పఠించే వాడు, బహిరంగంగా సదఖా (దాన ధర్మములు) చేసినటువంటి వాడు, ఖుర్’ఆన్ ను ఒంటరిగా (ఏకాంతములో) పఠించేవాడు, రహస్యముగా సదఖా చేసినటువంటి వాడు”

ఉఖబహ్ బిన్ ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఖుర్’ఆన్ ను బహిరంగంగా పఠించే వాడు, బహిరంగంగా సదఖా (దాన ధర్మములు) చేసినటువంటి వాడు, ఖుర్’ఆన్ ను ఒంటరిగా (ఏకాంతములో) పఠించేవాడు, రహస్యముగా సదఖా చేసినటువంటి వాడు”.

[దృఢమైనది] [رواه أبو داود والترمذي والنسائي]

الشرح

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరైతే ప్రకటించి ఖుర్’ఆన్ పఠనం గావిస్తాడో అతడు ప్రకటించి దానధర్మములు చేయువాని వంటివాడు; అలాగే ఎవరైతే చాటుగా, ఏకాంతములో ఖుర్’ఆన్ పఠనం గావిస్తాడో అతడు రహస్యంగా దానధర్మములు చేయునటువంటి వాడు.

فوائد الحديث

ఏ విధంగా నైతే, రహస్యంగా దానధర్మాలు చేయుట ఉత్తమమో, అలాగే ఖుర్’ఆన్ ను ఒంటరిగా (ఏకాంతములో) పఠించుట ఉత్తమం. అలా చేయుటలో నిజాయితీ, చిత్తశుద్ధీ ఉంటాయి. కపటత్వము, ప్రదర్శనా బుద్ధీ, గర్వము మరియు అతిశయముల నుండి దూరంగా ఉన్న వారము అవుతాము. అయితే ఒకవేళ బహిరంగంగా చేయవలసిన అవసరం ఏర్పడినా, లేక అలా చేయుటలో ప్రజా ప్రయోజనం ఉన్నా ఆ విధంగా చేయుటలో తప్పులేదు. ఉదాహరణకు మిగతా వారిని ప్రోత్సహించే ఉద్దేశ్యముతో బహిరంగంగా దానధర్మాలు చేయుట, ఖుర్’ఆన్ బోధించే ఉద్దేశ్యముతో బహిరంగంగా ఖుర్’ఆన్ పఠించుట.

التصنيفات

దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు, హృదయము యొక్క కార్యల ప్రాముఖ్యతలు, దివ్యఖుర్ఆన్ పారాయణ పద్దతులు