“భూమి సంపాదనలో నిమగ్నులు కాకండి; తద్వారా మీరు ఇహలోక సుఖాల వైపునకు ఆకర్షించబడవచ్చు.”

“భూమి సంపాదనలో నిమగ్నులు కాకండి; తద్వారా మీరు ఇహలోక సుఖాల వైపునకు ఆకర్షించబడవచ్చు.”

అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “భూమి సంపాదనలో నిమగ్నులు కాకండి; తద్వారా మీరు ఇహలోక సుఖాల వైపునకు ఆకర్షించబడవచ్చు.”

[పరా ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పొలాలు, పండ్ల తోటలు, వ్యవసాయ భూములు వగైరాలను సంపాదించడాన్ని వారించారు. ఎందుకంటే ఇవి ఇహలోకం పట్ల కోరికకు, మరియు పరలోక జీవితం పై ఇహలోకపు ప్రాధాన్యాలు, కోరికలు పై చేయి కావడానికి కారణమవుతాయి.

فوائد الحديث

ఈ వారింపు ప్రాపంచిక వస్తువులను, అవసరమైనదానికంటే ఎక్కువ సమీకరించడాన్ని, అవసరమైనదానికంటే ఎక్కువగా వాటి వినియోగములో పడిపోవడాన్ని వ్యతిరేకిస్తుంది, ఇది పరలోకం నుండి దృష్టి మరల్చడానికి దారితీస్తుంది.

ఈ హదీథు జీవనోపాధిని సంపాదించుకోవడాన్నివారించదు. ఈ ఇహలోకపు సుఖాలలో మునిగిపోయి పరలోకాన్ని మరిచిపోవడాన్ని వారిస్తున్నది.

అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: దీని అర్థం ఏమిటంటే పొలాలు, పండ్ల తోటలు, వ్యవసాయ భూములు వగైరాలను సంపాదించడంలో మగ్నులైపోకండి. ఎందుకంటే అలా మగ్నులైపోవడం అల్లాహ్ యొక్క స్మరణ నుండి మిమ్ములను దూరం చేస్తుంది.

التصنيفات

సద్గుణాలు మరియు పద్దతులు, ఇహలోక ఇష్టత ఖండన