إعدادات العرض
:
:
ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: (ఇతను బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు మరియు అఖ్బా రాత్రి ప్రమాణం చేసిన 12 మందిలో ఒకరు). రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, తన చుట్టూ కూర్చుని ఉన్న సహాబాలతో ఇలా ప్రమాణం తీసుకున్నారు: "మీరు నాతో ఈ విషయాలపై ప్రమాణం చేయండి: అల్లాహ్ కు ఎవరినీ భాగస్వాములుగా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మీ పిల్లలను చంపకూడదు, మీరు మీ చేతులతో, కాళ్లతో కలిపి కల్పించే అబద్ధాలను (బురదారోపణలు) చేయకూడదు, మంచి విషయాల్లో (మారూఫ్) నాకు అవిధేయత చేయకూడదు. మీరు ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటే, మీ ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంటుంది. మీరు ఈ పాపాల్లో ఏదైనా చేసి, ఈ లోకంలో శిక్ష అనుభవిస్తే, అది మీకు కఫ్ఫారా (పాప పరిహారం) అవుతుంది. మీరు ఏదైనా పాపం చేసినా, అల్లాహ్ దాన్ని దాచిపెడితే, అది అల్లాహ్ ఇష్టం మీదే ఉంటుంది — అతను క్షమించవచ్చు, లేక శిక్షించవచ్చు." మేము ఈ ప్రతిజ్ఞపై ఆయనతో ఒప్పందం చేసుకున్నాం.
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Nederlands Bahasa Indonesia Kiswahili Hausa සිංහල English ગુજરાતી Magyar ქართული Română Русский Português ไทยالشرح
ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) — బదర్ యుద్ధంలో పాల్గొన్నవారు, తన జాతిలో పెద్దవారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు సహాయ పడేందుకు అఖ్బా రాత్రి మినాలో అంటే మదీనాకు వలస వెళ్ళక ముందు మక్కాలో ఉన్నప్పుడు ఆయనతో బైఅత్ (ప్రతిజ్ఞ) చేసినవారిలో ముందున్నారు — ఇలా పలికినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుల మధ్య కూర్చుని, వారిని కొన్ని ముఖ్యమైన విషయాల్లో తనకు ప్రతిజ్ఞ (బైఅత్) చేయమని కోరారు..." మొట్టమొదటిది: వారు అల్లాహ్‌ను ఆరాధించడంలో ఎంత చిన్న భాగస్వామ్యాన్ని కూడా చేర్చకూడదు. రెండవది: వారు దొంగతనం చేయకూడదు. మూడవది: వారు వ్యభిచారం (అవాంఛిత లైంగిక సంబంధం) చేయకూడదు. నాలుగవది: వారు తమ పిల్లలను చంపకూడదు — ముఖ్యంగా ఆడపిల్లలను అవమాన భయంతో, లేదా అబ్బాయిలను పేదరికం భయంతో చంపకూడదు. ఐదవది: వారు అబద్ధాన్ని కల్పించి, తమ చేతులు, కాళ్లతో (చర్యల ద్వారా) దాన్ని ఆచరించరణలో పెట్టకూడదు. ఎందుకంటే, మనం చేసే చాలా పనులు ప్రధానంగా మన చేతులు, కాళ్ల ద్వారానే జరుగుతాయి, ఇతర అవయవాల ప్రమేయం ఉన్నా కూడా. ఆరవది: వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మంచిపనులలో (మారూఫ్) అవిధేయత చూపకూడదు. అందులో ఎవరు ఈ ఒప్పందాన్ని (ప్రతిజ్ఞను) నిలబెట్టుకుని, దానిని పాటిస్తారో, వారి ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంటుంది. ఎవరైనా పైన చెప్పిన పాపాల్లో (అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం తప్ప) ఏదైనా చేసి, ఈ లోకంలో శిక్ష (హద్ శిక్ష) అనుభవిస్తే, అది అతనికి కఫ్ఫారా (పాప పరిహారం) అవుతుంది, దాంతో అతని పాపం క్షమించబడుతుంది. ఎవరైనా పాపం చేసినా, ఒకవేళ అల్లాహ్ దాన్ని దాచి పెడితే, అతని విషయం అల్లాహ్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది — అల్లాహ్ క్షమించ వచ్చు, లేక శిక్షించవచ్చు. అపుడు, అక్కడ ఉన్నవారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ ఒప్పందాన్ని చేశారు.فوائد الحديث
ధర్మపోరాటం విధిగావించబడటానికి ముందు మక్కాలోని అఖాబాలో ఏ విషయాలపై మొదటి ప్రతిజ్ఞ చేయబడినదో ఇక్కడ స్పష్టం చేయబడింది.
సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "హదీథులో వచ్చిన 'మారూఫ్‌లో' (మంచి విషయాల్లో) గురించి — ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలన్నీ మంచి విషయాలే, వాటిలో తప్పు ఉండదు. కాబట్టి ఇక్కడ 'మారూఫ్' అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా విధేయత ఎందుకు అవసరమో చెప్పడమే కాదు, మరియు ఏ మానవుడైనా తప్పుడు విషయాల్లో విధేయత కోరితే అందులో విధేయత చూపకూడదు అని కూడా తెలియజేస్తుంది. ప్రతిజ్ఞ (బైఅత్) ను కూడా మంచి విషయాల విధేయతకు మాత్రమే పరిమితం చేయాలి, అందులోని ప్రతీ విషయానికీ కాదు."
ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ అత్తైమీ మరియు ఇతరులు ఇలా చెప్పారు: పిల్లల హత్యను ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం: ఇది ఒక హత్య మాత్రమే కాదు, బంధుత్వాన్ని (రహ్మ్) కూడా తెంచడం అవుతుంది. అందుకే, దీనిని నిషేధించడంపై మరింత గంభీరంగా తీసుకోవాలి. ఎందుకంటే, ఆ కాలంలో (జాహిలీయ్యా కాలంలో) పిల్లల హత్య — ముఖ్యంగా ఆడపిల్లలను పుట్టగానే వారిని ప్రాణాలతో సజీవంగా పూడ్చడం, లేదా అబ్బాయిలను పేదరికం భయంతో చంపడం — సామాన్యంగా జరుగుతూ ఉండేది. లేదా పిల్లలను ప్రత్యేకంగా ప్రస్తావించడంలో మరో కారణం: వారు తమను తాము రక్షించుకోలేరు, అందుకే వారికి హాని కలిగించడాన్ని కఠినంగా నిషేధించారు.
ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఈ హదీథులోని సాధారణ అర్థాన్ని ఖుర్ఆన్ వాక్యం {నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామ్యం కలుగ జేయడాన్ని క్షమించడు} (సూరతున్నిసా 4:48) ద్వారా పరిమితం చేయాలి. అంటే, ఎవరు ఇస్లాం నుండి మరలి పోయి (ముర్తద్ అయి) మరణ శిక్ష పొందితే,
ఆ చావు అతనికి కఫ్ఫారా (పాప పరిహారం) కాదు."
ఖాదీ ఇయాద్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎక్కువ మంది ఇస్లామీయ పండితుల అభిప్రాయం ఏమిటంటే, "హద్దు శిక్షలు (ధర్మశాస్త్రంలో నిర్ణయించిన శిక్షలు) పాపానికి పరిహారం (కఫ్ఫారా) అవుతాయి."
التصنيفات
తౌబా (పశ్చాత్తాపము)