ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; మరియు దాని కొరకు అతడు ఇహలోకములో…

ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; మరియు దాని కొరకు అతడు ఇహలోకములో శిక్షించబడతాడో, అల్లాహ్ ఎంతటి న్యాయవంతుడు అంటే అల్లాహ్ అతనికి పరలోకములో రెండవసారి శిక్ష విధించడు

అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; మరియు దాని కొరకు అతడు ఇహలోకములో శిక్షించబడతాడో, అల్లాహ్ ఎంతటి న్యాయవంతుడు అంటే అల్లాహ్ అతనికి పరలోకములో రెండవసారి శిక్ష విధించడు; అలాగే ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; అల్లాహ్ దానిని ఇహలోకములో అతని కొరకు కప్పివేసి, దానిని క్షమించి వేసాడో, అల్లాహ్ ఎంతటి దయగలవాడు అంటే తాను అప్పటికే క్షమించిన దానిని, పరలోకములో తిరిగి వెలికి తీయడు.

[ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియఏస్తున్నారు: ‘షరియత్’లో నిర్దిష్టమైన శిక్షలు నిర్ణయించబడిన పాపములలో (ఉదా: దొంగతనము, వ్యభిచారము మొ.) ఎవరైనా ఏదైనా పాపము చేసి ఉండి, ఆ పాపానికి అతడు ఈ లోకములో శిక్షించబడితే, ఆ శిక్ష అతని ఆ పాపాన్ని తొలగిస్తుంది; మరియు ఆ పాపానికి పరలోకములో శిక్షనుండి విముక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే ఒకే పాపానికి రెండు శిక్షలు విధించడు; మరియు అల్లాహ్ ఈ లోకములో ఎవరి పాపాన్నైనా కప్పివేసి ఉండి, అతడిని మన్నించి, క్షమించి ఉన్నట్లైతే, మరియు అతడు ఆ పాపానికి ఈ లోకములో శిక్షించబడకపోయినట్లైతే, అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే తాను అప్పటికే మన్నించి, క్షమించివేసిన పానికి పరలోకములో తిరిగి శిక్ష విధించడు.

فوائد الحديث

అల్లాహ్ యొక్క న్యాయం, దాతృత్వం మరియు దయ గొప్పవి.

ఈ ప్రపంచంలో షరియత్’లో నిర్ణయించబడిన శిక్షను విధించుట వలన పాపం ప్రాయశ్చిత్తమవుతుంది.

షరియత్’లో నిర్దుష్టంగా శిక్షలు నిర్ణయించబడిన పాపములలో ఎవరైనా ఏదైనా పాపపు పనికి పాల్బడితే, అతడు తనను తాను అల్లాహ్ యొక్క రక్షణద్వారా ఆ పాపము నుండి కప్పివేసుకోవాలి, మరియు నిజాయితీగా, మనస్ఫూర్తిగా ఆ పపపు పనికి పాల్బడినందుకు పశ్చాత్తాపపడాలి.

التصنيفات

హద్దులు