. .

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఇస్లాం మొదట్లో పరాయిగా (అన్యంగా, అపరిచితంగా) ప్రారంభమైంది. ఇది మళ్లీ మొదట్లో ఉన్నట్లుగానే పరాయిగా మారిపోతుంది. కాబట్టి, (దానిని గట్టిగా పట్టుకుని ఉండేవారికి) పరాయివారికి శుభం కలుగుగాక!"

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రారంభంలో ఇస్లాం ధర్మాన్ని కొద్దిమంది మాత్రమే అనుసరించేవారు, ఆ తొలికాలంలో ఇస్లాం ధర్మం అనేది పరాయిగా (అపరిచితమైనదిగా) ఉండేది. భవిష్యత్తులో కూడా, దాన్ని నిజంగా పాటించేవారు చాలా తక్కువ అయిపోతారు, అంటే ఇస్లాం మళ్లీ ఆ పరాయితన అపరిచిత స్థితికి చేరుకుంటుంది. అందుకే, అలాంటి పరాయితన స్థితిలో కూడా దానిని అనుసరిస్తూ, ఇస్లాంను గట్టిగా పట్టుకున్నవారికి శుభం, అభినందన, ఆనందం, హర్షం కలుగుగాక!"

فوائد الحديث

ఇస్లాం పరాయిగా మారుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినది - ఇస్లాం ఒకప్పుడు విస్తృతంగా వ్యాపించి, ప్రజల్లో ప్రసిద్ధి చెందిన తర్వాత మళ్లీ పరాయితన స్థితికి చేరుతుందని సూచన.

ఇది ప్రవక్తత్వానికి (నుబువ్వత్‌కి) ఒక గొప్ప సూచన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన తరువాత ఏం జరుగుతుందో (అల్లాహ్ అనుజ్ఞతో) ముందే చెప్పారు, ఆ విషయాలు ఆయన చెప్పినట్లుగానే జరిగాయి.

ఇస్లాం కోసం తన స్వదేశాన్ని, బంధువులను వదిలి వలస వెళ్లినవారికి లభించే గొప్ప ప్రతిఫలం ఉంది — అలాంటి వారికి స్వర్గం లభిస్తుంది.

"గురబా" (పరాయివారు) అంటే — పాపాలు పెరిగినప్పుడు కూడా తాము సజ్జనులుగా ఉండేవారు, లేకపోతే, ఇతరులు చెడిపోయినప్పుడు, సమాజాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసే వారు.

التصنيفات

పుణ్యాత్ముల స్థితులు