:

ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరునితో "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అనకూడదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ విధంగా అవిశ్వాసి అని అనడం వలన, ఆ మాట వారిద్దరిలో ఒకరిపై పడుతుంది: అది నిజంగా అతనికి సరిపోతే, అప్పుడు ఆ మాట అతను అలా అన్న వ్యక్తిపై పడుతుంది; ఒకవేళ అలా లేకపోతే, ఆ నింద తిరిగి చెప్పినవాడిపైనే పడుతుంది.

فوائد الحديث

ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరునిపై అతనిలో లేని అవిధేయత లేదా అవిశ్వాసం (కుఫ్ర్) వంటి లక్షణాలను ఆపాదించకుండా నిరోధించడం.

ఈ చెడ్డ మాటల నుండి హెచ్చరిక ఉంది. ఎవైతే ఈ మాటలు తన సోదరుని గురించి మాట్లాడతాడో అతను పెద్ద ప్రమాదంలో ఉంటాడు. కాబట్టి, నోరు జాగ్రత్తగా వాడాలి; వివేకంతోనే మాటలాడాలి.

التصنيفات

ఇస్లాం, మాట్లాడే మరియు మౌనంగా ఉండే పద్దతులు