: . .

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఆదం కుమారుడు "కాలాన్ని దూషించడం ద్వారా" నన్ను బాధిస్తున్నాడు - అసలు కాలం అంటే నేను (అల్లాహ్‌నే). సర్వాధికారమూ నా చేతిలోనే ఉంది. నేనే రాత్రిని, పగటిని మారుస్తున్నాను."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: మహోన్నతుడైన అల్లాహ్ ఖుద్సీ హదీథ్‌లో ఇలా అంటున్నాడు — "కష్టాలు, అపాయాలు వచ్చినప్పుడు — మనిషి కాలాన్ని తిడుతూ నన్ను బాధపెడుతున్నాడు, నా సార్వభౌమత్వాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రతిదాన్నీ నడిపించే అధికారం కేవలం నా వద్ద మాత్రమే ఉంది. ఏమి జరిగినా, అదంతా నా ఆజ్ఞతోనే జరుగుతున్నది. కాబట్టి కాలాన్ని తిడటమంటే, నిజానికి నన్నే తిడటమే."

فوائد الحديث

ఈ హదీథును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువైన అల్లాహ్ నుండి వివరించారు. దీన్ని హదీథు ఖుద్సీ అంటారు. దీని అర్థం మరియు పదాలు రెండూ అల్లాహ్ నుండే వచ్చాయి. అయితే, ఇది ఖుర్ఆన్‌కు ఉన్న ప్రత్యేకతలు కలిగి ఉండదు. అంటే: దీని పారాయణం ప్రత్యేకమైన ఆరాధనగా పరిగణించబడదు, దీనిని చదవడానికి తప్పనిసరిగా ఉదూ చేయవలసిన అవసరం లేదు, ఖుర్ఆన్ లాగా దీనిలో అల్లాహ్ మార్గదర్శకం లేదా మహిమ ఉండదు, ఇంకా ఇతర ఖుర్ఆన్ ప్రత్యేకతలు దీనిలో ఉండవు.

మాటలలో మరియు నమ్మకాలలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల మర్యాదగా ఉండండి.

అల్లాహ్ నిర్ణయాన్ని, విధివ్రాతను నమ్మడం, ఆపద ఎదురైనప్పుడు ఓపికగా ఉండటం అవసరం.

"‘బాధ’ (అదా اذى) అనేది ‘కష్టం, నష్టం, హాని’ (దరర్ ضرر) తో సమానమైనది కాదు. మానవుడు ఏదైనా అసభ్యమైన విషయాన్ని వినటం వల్ల లేదా చూడటం వల్ల బాధపడవచ్చు (అదా), కానీ అది అతనికి ప్రత్యక్షంగా హానికరం (ధరర్) కాదు. ఇదే విధంగా, దుర్గంధం కలిగిన వాసనలుగా పరిగణించబడే ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన వలన కూడా ఒకడు అసహ్యానికి గురై బాధపడవచ్చు (అదా), కానీ ఆ అయిష్టమైన వాసన వలన ఆరోగ్యానికి హాని కలుగదు (ధెరర్ కాదు)."

అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొంతమంది తన దాసుల చెడు పనుల వల్ల బాధపడతాడు (అదా), అంతేగానీ ఆయనకు అసలు ఎలాంటి నష్టం (దరర్) కలగదు. అల్లాహ్ తన హదీథు ఖుద్సీలో ఇలా పలికినాడు: "ఓ నా దాసులారా! మీరు నాకు నష్టం కలిగించే స్థాయికి ఎన్నటికీ చేరుకోలేరు, నన్ను ఏ విధంగా నష్టపరిచే శక్తి మీకు లేదు. అలాగే, మీరు నాకు లాభం చేకూర్చే స్థాయికి కూడా ఎన్నటికీ చేరుకోలేరు, నాకు లాభపర్చే శక్తి మీకు లేదు."

కాలాన్ని శపించడం మరియు వర్ణించడం మూడు వర్గాలుగా విభజించబడింది: 1- కాలమే కర్త అనే కారణంతో దానిని శపించడం; మరియు కాలమే విషయాలను మంచి మరియు చెడుగా మారుస్తుందని అతను నమ్మాడు కాబట్టి ఇది పెద్ద షిర్క్! ఎందుకంటే అతను అల్లాహ్‌తో పాటు ఒక సృష్టికర్త ఉన్నాడని మరియు సంఘటనల సృష్టిని అల్లాహ్ కు కాకుండా మరొకరికి ఆపాదించాడు కాబట్టి. 2- కాలాన్ని కర్త అని అతను నమ్మడం వలన కాదు; దానికి బదులుగా, అల్లాహ్ కర్త అని అతను నమ్ముతాడు, కానీ ఈ అసహ్యకరమైన విషయానికి, కష్టానికి ఆయనే మూలం భావించాడు కాబట్టి ఆయనను శపిస్తాడు; ఇది నిషేధించబడింది. 3- నిందలు వేయకుండా పూర్తిగా నివేదించడానికి ఉద్దేశించడం; ఇది అనుమతించదగినది, మరియు లూత్ అలైహిస్సలాం ఇలా పలికినారు: {మరియు అతను ఇలా అన్నాడు, "ఇది చాలా కష్టమైన రోజు." (సూరహ్ హూద్: 77)}

التصنيفات

మాట్లాడే మరియు మౌనంగా ఉండే పద్దతులు