నివృత్తి

నివృత్తి

1- “బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి.* వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది (తిరిగి అతడిని ఆ విధంగా శిక్షించడం జరుగుతుంది). అప్పుడు ఒక దినము యాభైవేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది. ఆ శిక్ష అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకూ కొనసాగుతూ ఉంటుంది. తరువాత అతడు అతని గమ్యస్థానమైన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (చూపడం జరుగుతుంది).