إعدادات العرض
1- అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కష్టకాలంలో ఇలా పలికేవారు: "లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్ అజీముల్ హలీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుల్ అర్షిల్ అజీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుస్సమావాతి వ రబ్బుల్ అర్ది, వ రబ్బుల్ అర్షిల్ కరీమ్ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహాన్నతుడు, మహాసహనశీలుడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహా సింహాసనానికి అధిపతి. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఆకాశాలకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు ఘనమైన సింహాసనం యొక్క అధిపతి)