إعدادات العرض
"రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో…
"రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు."
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు."
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी සිංහල Hausa Kurdî Português Tiếng Việt অসমীয়া Nederlands Kiswahili ગુજરાતી Magyar ქართული Română ไทยالشرح
రమదాన్ నెల ప్రారంభమైనప్పుడు, మూడు విషయాలు జరుగుతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపినారు: మొదటిది: స్వర్గద్వారాలు తెరవబడతాయి మరియు వాటిలో ఏదీ మూసివేయబడదు. రెండవది: నరకద్వారాలు మూసివేయబడతాయి మరియు వాటిలో ఏదీ తెరవబడదు. మూడవది: షైతానులు మరియు దుష్ట జిన్నులు సంకెళ్లతో కట్టివేయబడతారు. అందువలన, రమదాన్ కాకుండా ఇతర నెలలలో వారు సాధించగలిగిన సాఫల్యాలు, ఈ నెలలో సాధించలేరు (అంటే ప్రజలను మార్గభ్రష్టత్వం వైపు ప్రేరేపించలేరు). ఇవన్నీ ఈ పవిత్రమైన నెల గొప్పదనాన్ని కీర్తించడానికీ, అలాగే నమాజ్, సదకా, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మొదలైన పుణ్యకార్యాలు ఎక్కువగా చేసేలా, పాపాలు మరియు అవిధేయతలు నుండి దూరంగా ఉండేలా విశ్వాసులను ప్రోత్సహించడానికీను.فوائد الحديث
రమదాను మాసం యొక్క ఘనత
ఈ పుణ్యమైన రమదాన్ మాసం ఆరాధనల మరియు మంచి పనుల ఋతువు అని ఉపవాసం పాటించే వారికి శుభవార్త ఇవ్వబడింది.
రమదాన్ నెలలో షైతానులను బంధించడం అనేది షైతానుల బంధంలో చిక్కుకున్నాననే వ్యక్తి యొక్క సాకు తొలగించబడిందని సూచిస్తుంది, అంటే అతనికి చెప్పినట్లుగా: షైతానులు నీ వద్దకు రాకుండా నిరోధించబడ్డాయి, కాబట్టి ఇక విధేయతను విడిచి పెట్టడానికి లేదా పాపం చేయడానికి వాటిని సాకుగా చూపించే అవకాశం నీకు లేదు.
ఖుర్తుబి ఇలా అన్నారు: మరి, రమదాన్ నెలలో ఇన్ని చెడుపనులు మరియు పాపాలు జరుగుతూ ఉండడాన్ని మనం ఎలా చూస్తున్నాము? షైతానులను బంధించినట్లయితే, ఇలా జరగ కూడదు కదా? సమాధానం: ఉపవాసం పాటించేవారిలో చెడుపనులు, పాపాలు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఉపవాసం యొక్క షరతులు మరియు దాని మర్యాదలు పాటించబడతాయి. లేదా కొన్ని ఉల్లేఖనలలో చెప్పబడినట్లు, బంధించబడినవి కొన్ని దయ్యాలు, తిరుగుబాటుదారులు మాత్రమే, మొత్తం అన్నీ బంధించబడలేదు. లేదా ఉపవాస సమయంలో చెడులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఇలా చెప్పబడి ఉంటుంది. మరియు ఇది స్పష్టంగా అర్థం అవుతుంది, ఎందుకంటే ఉపవాస సమయంలో దాని సంభవం ఇతర సమయాల కంటే తక్కువగా ఉంటుంది. అవన్నీ బంధించబడినందున, ఎటువంటి చెడు లేదా పాపం జరిగే అవకాశం లేదు, ఎందుకంటే అలా చెడుపనులు జరగటానికి షైతానులే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి, దుష్ట ఆత్మలు, చెడు అలవాట్లు మరియు మానవులలోని దుష్టులు మొదలైనవి.
التصنيفات
ఉపవాసాల ఘనత