. . :

హసన్ ఉల్లేఖనం ఆయన ఇలా పలికినారు: జుందుబ్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఈ మస్జిదులో దీనిని మాకు తెలియపరచారు. ఆయన మాకు తెలియపరచినప్పటి నుండి మేము దీనిని మరిచిపోలేదు మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో జుందుబ్ అబద్ధం చెబుతాడనే భయం కూడా మాకు లేదు. అతడి పలుకులు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: మీకు పూర్వం జీవించినవారిలో ఒక వ్యక్తి గాయపడినాడు. అతడు సహనం కోల్పోయి, కత్తితో తన చేతిని కోసుకొనగా, ఆ రక్తస్రావంతో మరణించాడు. దానికి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించినాడు: "నా దాసుడు తన మరణం విషయంలో త్వరపడినాడు; అందువలన నేను అతని కొరకు స్వర్గాన్ని నిషేధించాను."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: పూర్వకాలంలో ఒక వ్యక్తి గాయపడినాడు. అతడు బాధకు తట్టుకోలేక, సహనం కోల్పోయి, కత్తితో తన చేతిని కోసుకున్నాడు. దాని వలన రక్తస్రావం ఆగక, చివరకు అతడు మరణించాడు. దానికి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికినాడు: "నా దాసుడు తన మరణాన్ని త్వరగా తెచ్చుకున్నాడు; కాబట్టి నేను అతనికి స్వర్గాన్ని నిషేధించాను."

فوائد الحديث

బాధలు, కష్టాలు ఎదురైనప్పుడు ఓర్పుగా ఉండటం మరియు నొప్పులు గురించి ఎక్కువగా ఫిర్యాదు చేయకుండా ఉండటం ఎంతో గొప్ప గుణం. ఇలా చేస్తే, మనం మరింత పెద్ద ప్రమాదాలకు లోనవకుండా ఉంటాము.

పూర్వప్రజల ప్రామాణిక గాథలు మనకు మంచితనాన్ని, గుణపాఠాలను అందిస్తాయి.

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇది అల్లాహ్ హక్కులను గౌరవించడాన్ని, అలాగే ఆయన తన సృష్టిపై చూపిన కరుణను నొక్కి వక్కాణిస్తున్నది. అల్లాహ్ మన ప్రాణాలు మనకు స్వంతం కావని, అవి ఆయనకు చెందినవని తెలుపుతున్నాడు. అందువలన మనం స్వయంగా మన ప్రాణాలను తీసుకోవడాన్ని అంటే ఆత్మహత్యను ఆయన నిషేధించాడు. కాబట్టి, మనం తప్పకుండా అల్లాహ్ ఆదేశాలను పాటించాలి మరియు ఆయన మనపై చూపే కరుణాకటాక్షాలను గుర్తుంచుకోవాలి.

ఆత్మహత్యకు అంటే తన ప్రాణాన్ని స్వయంగా తానే తీసుకోవడానికి దారి తీసే పనులు కఠినంగా నిషిధించబడినాయి, దీనిపై గంభీరమైన హెచ్చరిక కూడా ఉంది.

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా పలికినారు: దీనిని అతడు చికిత్స కోసం కాకుండా, (బాధకు ఓర్చుకోలేక) చనిపోవాలనే ఉద్దేశంతోనే తనను తాను కోసుకున్నాడని సూచిస్తుంది.

అంటే, అతడు తనకు మేలు కలిగించే చికిత్స ఉద్దేశంతో కాకుండా, ప్రాణాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ పని చేశాడు.

التصنيفات

పాపకార్యముల ఖండన