"అల్లాహ్ నిర్దేశించిన హుదూద్ మహాశిక్షలను మినహాయించి, ఎవరికీ పది కొరడా దెబ్బల కంటే ఎక్కువ కొరడా దెబ్బల శిక్ష…

"అల్లాహ్ నిర్దేశించిన హుదూద్ మహాశిక్షలను మినహాయించి, ఎవరికీ పది కొరడా దెబ్బల కంటే ఎక్కువ కొరడా దెబ్బల శిక్ష విధించకూడదు"

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని అబూ బుర్దహ్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: "అల్లాహ్ నిర్దేశించిన హుదూద్ మహాశిక్షలను మినహాయించి, ఎవరికీ పది కొరడా దెబ్బల కంటే ఎక్కువ కొరడా దెబ్బల శిక్ష విధించకూడదు"

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది కొరడా దెబ్బలకు మించి ఎవరినీ కొరడా దెబ్బలు కొట్టకూడదని నిషేధించారు. అయితే, ఈ నిషేధం, పెద్ద పాపాలకు నిర్దేశించబడిన హుదూద్ మహాశిక్షలకు వర్తించదు. ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే, శిక్షార్థంగా కొట్టడం, ఉదాహరణకు భార్య లేదా బిడ్డను కొరడాతో కొట్టడం, అది పది కొరడా దెబ్బలకు మించకూడదు.

فوائد الحديث

మహోన్నతుడైన అల్లాహ్ నిర్దేశించిన హద్దులు (హద్ద్ శిక్షలు) — ఆయన ఆజ్ఞాపించినవి లేదా నిషేధించినవి మరియు ప్రజలు తప్పు చేయకుండా నిరోధించేందుకు నిర్దిష్టమైన శిక్షలను కలిగి ఉంటాయి. ఈ శిక్షలు కొన్ని సందర్భాల్లో షరియతులో స్పష్టంగా నిర్దేశించబడినాయి (ఉదా: హద్ద్ శిక్షలు), మరికొన్ని సందర్భాల్లో పాలకుడి వివేచనాధికారానికి వదిలివేయబడినాయి; పాలకుడు సమాజానికి ఏది ప్రయోజనకరమో దానిని అనుసరించి నిర్ణయం తీసుకునేలా.

క్రమశిక్షణ చర్యలు తేలికగా ఉండాలి — అవి మార్గనిర్దేశం చేయడానికి మరియు హెచ్చరించడానికి సరిపోయేంత మాత్రమే ఉండాలి. క్రమశిక్షణ కోసం మరీ అవసరమైతేనే వేసే శిక్ష కూడా, పది దెబ్బలకు మించకూడదు. అయితే, కొట్టకుండా దిశానిర్దేశం, బోధన, మార్గదర్శనం, ప్రోత్సాహం ద్వారా క్రమశిక్షణ చేయడం మరింత మంచిది. ఈ విధానం ఎక్కువగా ఆమోదించబడుతుంది, అలాగే బోధనలో మృదుత్వాన్ని పెంపొందిస్తుంది. ఒక్కో సందర్భంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండవచ్చు, అందువలన ఏది ఎక్కువగా అనుకూలమో, దానిని ఎంచుకోవాలి.

التصنيفات

శిక్షల ఆదేశాలు