ఎవరైనా ముస్లిం పాపం లేదా బంధుత్వాన్ని తెంచే వేడుకోలు లేని దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా అతనికి మూడు…

ఎవరైనా ముస్లిం పాపం లేదా బంధుత్వాన్ని తెంచే వేడుకోలు లేని దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా అతనికి మూడు విషయాల్లో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అతని దుఆను వెంటనే నెరవేర్చుతాడు, లేదా దుఆకు బదులుగా అతనికి పరలోకంలో పుణ్యాలు ప్రసాదించబడేందుకు ఆపుతాడు, లేదా ఆ దుఆ స్థాయిలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగిస్తాడు." అప్పుడు సహాబాలు అడిగారు: "అయితే మేము ఎక్కువగా దుఆ చేస్తాం!" దానికి ప్రవక్త ﷺ అన్నారు: "అల్లాహ్ మరింత ఎక్కువగా (ఇస్తాడు)

అబూ సయీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా ముస్లిం పాపం లేదా బంధుత్వాన్ని తెంచే వేడుకోలు లేని దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా అతనికి మూడు విషయాల్లో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అతని దుఆను వెంటనే నెరవేర్చుతాడు, లేదా దుఆకు బదులుగా అతనికి పరలోకంలో పుణ్యాలు ప్రసాదించబడేందుకు ఆపుతాడు, లేదా ఆ దుఆ స్థాయిలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగిస్తాడు." అప్పుడు సహాబాలు అడిగారు: "అయితే మేము ఎక్కువగా దుఆ చేస్తాం!" దానికి ప్రవక్త ﷺ అన్నారు: "అల్లాహ్ మరింత ఎక్కువగా (ఇస్తాడు)."

[దృఢమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ముస్లిం వ్యక్తి అల్లాహ్‌ను పాపానికి సంబంధించినది (ఉదా: ఏదైనా పాపపు పనిని సులభం చేయమని కోరడం, దుర్మార్గపు పనిలో సహాయం చేయమని అడగడం) లేదా బంధుత్వాన్ని తెంచే విధంగా (ఉదా: తన పిల్లలపై లేదా బంధువులపై శపించడం) కాకుండా ఏదైనా (మంచి విషయం కొరకు) దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా ఈ మూడింటిలో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అల్లాహ్ అతని దుఆను వెంటనే నెరవేర్చవచ్చు మరియు అతను కోరినదాన్ని వెంటనే అతనికి ప్రసాదించవచ్చు. లేదా, అల్లాహ్ ఆ దుఆలో వేడుకున్న దానిని ప్రసాదించడంలో ఆలస్యంగా చేస్తాడు - దాని ప్రతిఫలాన్ని పరలోకంలో అతనికి ఇస్తాడు, ఇది అతని స్థాయిని (స్థాయిని) పెంచేందుకు లేదా అతనిపై దయగా లేదా అతని పాపాల పరిహారంగా మారుతుంది. లేదా, ఆ దుఆ పరిమాణానికి అనుగుణంగా, అల్లాహ్ ఈ ప్రపంచంలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగించవచ్చు. అప్పుడు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: "అయితే, మేము ఎక్కువగా దుఆ చేస్తాము, ఎందుకంటే ఈ మూడు గొప్ప లాభాల్లో ఏదో ఒకటి మాకు లభిస్తుంది కదా?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ వద్ద ఉన్నది మీరు అడిగే దాని కంటే ఎంతో ఎక్కువ, ఎంతో గొప్పది. ఆయన దానం ఎన్నటికీ తరుగదు, ఎన్నటికీ సమాప్తి కాదు."

فوائد الحديث

ఒక ముస్లిం చేసే దుఆ అల్లాహ్ వద్ద తిరస్కరించబడదు, కానీ దాని కోసం కొన్ని షరతులు (నిబంధనలు), మర్యాదలు పాటించాలి. అందుకే, ప్రతి ముస్లిం ఎక్కువగా దుఆ చేయాలి, కానీ దానికి సమాధానం వెంటనే రావాలని ఆతృతపడకూడదు.

దుఆకు సమాధానం రావడం అంటే తప్పనిసరిగా మనం కోరుకున్నదే మనకు లభించాలని కాదు; అల్లాహ్ ఆ దుఆ ద్వారా మన పాపాలను క్షమించవచ్చు లేదా దాని ప్రతిఫలాన్ని పరలోకంలో మన కోసం నిల్వ చేయవచ్చు.

ఇబ్ను బాజ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: దుఆను పట్టుదలతో అడగటం, అల్లాహ్‌ పై మంచి ఆశతో ఉండడం (అంటే హుస్నుథ్ధన్ కలిగి ఉండటం), నిరాశ చెందకపోవడం — ఇవే దుఆకు సమాధానం లభించేందుకు దారి తీసే గొప్ప కారణాలు. కావున, ప్రతి వ్యక్తి దుఆలో పట్టుదలగా ఉండాలి, అల్లాహ్‌పై మంచి ఆశతో ఉండాలి, మరియు ఆయన మహావివేకం గలవాడని తెలుసుకోవాలి. అల్లాహ్ కొన్నిసార్లు దుఆను వెంటనే నెరవేర్చవచ్చు — దానికి ఒక వివేకం ఉంది; లేదా ఆలస్యంగా నెరవేర్చవచ్చు — దానికి కూడా ఒక వివేకం ఉంది; లేదా అడిగిన దాని కన్నా మంచి దాన్ని అతనికి ఇవ్వవచ్చు.

التصنيفات

దుఆ పద్దతులు