إعدادات العرض
1- ఎవరైనా ముస్లిం పాపం లేదా బంధుత్వాన్ని తెంచే వేడుకోలు లేని దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా అతనికి మూడు విషయాల్లో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అతని దుఆను వెంటనే నెరవేర్చుతాడు, లేదా దుఆకు బదులుగా అతనికి పరలోకంలో పుణ్యాలు ప్రసాదించబడేందుకు ఆపుతాడు, లేదా ఆ దుఆ స్థాయిలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగిస్తాడు." అప్పుడు సహాబాలు అడిగారు: "అయితే మేము ఎక్కువగా దుఆ చేస్తాం!" దానికి ప్రవక్త ﷺ అన్నారు: "అల్లాహ్ మరింత ఎక్కువగా (ఇస్తాడు)
2- నిశ్చయంగా మీ ప్రభువు బిడియపరుడు, ఉదారుడు. తన దాసుడు తన వైపు చేతులెత్తి అర్థించినప్పుడు, ఆయన వాటిని ఖాళీగా వాపసు చేయడానికి బిడియ పడతాడు
3- రసూలుల్లాహ్ ﷺ సంక్షిప్తంగాను, విస్తృత అర్థంతోనూ ఉండే దుఆలు (ప్రార్థనలు) చేయడం ఇష్టపడేవారు
4- మీలో ఎవ్వరూ ఇలా పలకవద్దు: ‘ఓ అల్లాహ్! నీ ఇష్టం ఉంటే నన్ను క్షమించు, నీకు ఇష్టం ఉంటే నా మీద కరుణ చూపు, నీకు ఇష్టం ఉంటే నాకు అన్నపానీయాలు (రిజ్క్) ఇవ్వు’ అని. బదులుగా, తన కోరికను కోరడంలో దృఢంగా అడగాలి. నిజంగా, అల్లాహ్ తాను కోరినదాన్ని చేస్తాడు, ఆయనను ఎవరూ బలవంతం చేయలేరు (ఆయన తన పని గురించి ఎవరితోనూ ఇబ్బంది పడడు)