إعدادات العرض
1- తన తల్లి బింతె రవాహా తన తండ్రిని తన సంపదలో కొంత భాగాన్ని అతని కొడుకుకు బహుమతిగా ఇవ్వమని అడిగింది. అతను ఒక సంవత్సరం పాటు సంకోచించాడు, కానీ ఆ తరువాత అతను నిర్ణయించుకున్నాడు. దానికి ఆమె ఇలా అంది: "నీవు నా కొడుకుకు ఇచ్చిన దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను సాక్షిగా ఉంచే వరకు నేను సంతృప్తి చెందను. అపుడు, నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, ఆ సమయంలో నేను చిన్నవాడిని, మరియు అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు తీసుకుని వెళ్ళి, ఇలా పలికినాడు: "ఓ రసూలుల్లాహ్! ఇతని తల్లి బింత్ రవాహా, నేను తన కొడుకుకు బహుమతిగా ఇచ్చిన దానికి మీరు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నది." దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ బషీర్! నీకు ఇతనే కాకుండా ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారా?" దానికి అతను "అవును" అని అనగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "నీవు వారందరికీ ఇదే బహుమతి ఇచ్చావా?" అతను "లేదు" అని సమాధానమిచ్చినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @"అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి సాక్ష్యమివ్వను."* మరియు ముస్లిం హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన పదాలలో ఇలా ఉన్నది: "అప్పుడు నన్ను కాదు, మరొకరిని దానికి సాక్షిగా ఉంచు."