తన తల్లి బింతె రవాహా తన తండ్రిని తన సంపదలో కొంత భాగాన్ని అతని కొడుకుకు బహుమతిగా ఇవ్వమని అడిగింది. అతను ఒక…

తన తల్లి బింతె రవాహా తన తండ్రిని తన సంపదలో కొంత భాగాన్ని అతని కొడుకుకు బహుమతిగా ఇవ్వమని అడిగింది. అతను ఒక సంవత్సరం పాటు సంకోచించాడు, కానీ ఆ తరువాత అతను నిర్ణయించుకున్నాడు. దానికి ఆమె ఇలా అంది: "నీవు నా కొడుకుకు ఇచ్చిన దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను సాక్షిగా ఉంచే వరకు నేను సంతృప్తి చెందను. అపుడు, నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, ఆ సమయంలో నేను చిన్నవాడిని, మరియు అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు తీసుకుని వెళ్ళి, ఇలా పలికినాడు: "ఓ రసూలుల్లాహ్! ఇతని తల్లి బింత్ రవాహా, నేను తన కొడుకుకు బహుమతిగా ఇచ్చిన దానికి మీరు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నది." దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ బషీర్! నీకు ఇతనే కాకుండా ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారా?" దానికి అతను "అవును" అని అనగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "నీవు వారందరికీ ఇదే బహుమతి ఇచ్చావా?" అతను "లేదు" అని సమాధానమిచ్చినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @"అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి సాక్ష్యమివ్వను."* మరియు ముస్లిం హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన పదాలలో ఇలా ఉన్నది: "అప్పుడు నన్ను కాదు, మరొకరిని దానికి సాక్షిగా ఉంచు."

నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: తన తల్లి బింతె రవాహా తన తండ్రిని తన సంపదలో కొంత భాగాన్ని అతని కొడుకుకు బహుమతిగా ఇవ్వమని అడిగింది. అతను ఒక సంవత్సరం పాటు సంకోచించాడు, కానీ ఆ తరువాత అతను నిర్ణయించుకున్నాడు. దానికి ఆమె ఇలా అంది: "నీవు నా కొడుకుకు ఇచ్చిన దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను సాక్షిగా ఉంచే వరకు నేను సంతృప్తి చెందను. అపుడు, నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, ఆ సమయంలో నేను చిన్నవాడిని, మరియు అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు తీసుకుని వెళ్ళి, ఇలా పలికినాడు: "ఓ రసూలుల్లాహ్! ఇతని తల్లి బింత్ రవాహా, నేను తన కొడుకుకు బహుమతిగా ఇచ్చిన దానికి మీరు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నది." దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ బషీర్! నీకు ఇతనే కాకుండా ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారా?" దానికి అతను "అవును" అని అనగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "నీవు వారందరికీ ఇదే బహుమతి ఇచ్చావా?" అతను "లేదు" అని సమాధానమిచ్చినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి సాక్ష్యమివ్వను." మరియు ముస్లిం హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన పదాలలో ఇలా ఉన్నది: "అప్పుడు నన్ను కాదు, మరొకరిని దానికి సాక్షిగా ఉంచు."

[దృఢమైనది]

الشرح

నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: నుమాన్ తల్లి, అమ్రహ్ బింట్ రావాహా (రదియల్లాహు అన్హా), తన భర్త బషీర్‌ను (నుమాన్ తండ్రిని) ఇలా అడిగింది: "నా కొడుకు నుమాన్‌కు మీ ఆస్తిలోంచి ఒక భాగాన్ని బహుమతిగా ఇవ్వండి" . దానికి బషీర్ మొదట అంగీకరించలేదు, దాన్ని ఒక సంవత్సరం పాటు ఆలస్యం చేశారు. తర్వాత, తన భార్య అభ్యర్థనను గౌరవించి, తన కుమారుడు నుమాన్‌కు ఆ బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అపుడు ఆమె అతనితో ఇలా అన్నది: 'మీరు నా కొడుకు నుమాన్‌కు ఇచ్చిన బహుమతికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను సాక్షిగా చేయకపోతే నాకు సంతృప్తి ఉండదు.' అప్పుడు నా తండ్రి (బషీర్) నా చేతిని పట్టుకుని, అపుడు నేను చిన్న వయసులో ఉన్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకెళ్ళి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికినారు: "ఓ రసూలుల్లాహ్! ఇతని తల్లి అమ్రహ్ బింతె రవాహ రదియల్లాహు అన్హా తన కొడుకు కోసం నేను ఇచ్చిన బహుమతికి మీరు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటుంది." అది విని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ బషీర్! నీకు ఇతనే కాకుండా ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారా?" అతడు "అవును" అన్నాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, "నీవు నీ ఇతర పిల్లలందరికీ కూడా ఇదే బహుమతి ఇచ్చావా?" అతడు "లేదు" అన్నాడు, అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బషీర్‌ తో ఇలా అన్నారు: "అయితే నన్ను దీనికి సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి (అన్యాయమైన పనికి) సాక్ష్యం ఇవ్వను." మరియు ముస్లింలో నమోదు చేయబడిన మరొక రివాయత్‌లో: "అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఇంకెవ్వరినైనా సాక్షిగా చేసుకో." అని ఉంది.

فوائد الحديث

బహుమతులు మరియు కానుకల విషయంలో కుమారులు మరియు కుమార్తెల మధ్య న్యాయం తప్పనిసరి. అయితే, ఆర్థిక పోషణ విషయంలో ప్రతి ఒక్కరి బాధ్యతలను, అవసరాలను బట్టి అది నిర్ణయించబడుతుంది.

"కొందరు పిల్లలకు ఇతర పిల్లలపై ప్రాధాన్యత ఇవ్వడం అనేది అన్యాయం మరియు అత్యాచారం. దీనికి సాక్ష్యమివ్వడం (ఆమోదించడం) లేదా దాన్ని అందజేయడం కూడా అనుమతించబడలేదు."

ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ విషయాన్ని ఇలా వివరించారు: "తల్లిదండ్రులు తమ పిల్లలందరిపట్ల బహుమతులు ఇవ్వడంలో సమానంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఇవ్వాలి; ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వకూడదు. కుమారులు, కుమార్తెలు అందరికీ సమానంగా ఇవ్వాలి." మా పండితులలో కొందరు ఇలా చెప్పారు: "బహుమతుల విషయంలో కూడా వారసత్వంలో ఉన్నట్లుగా, పురుషుడికి రెండింతలు, మహిళకు ఒక భాగం ఇవ్వాలి." కానీ సరైన మరియు ప్రసిద్ధ అభిప్రాయం ఏమిటంటే: "బహుమతుల్లో కుమారులు, కుమార్తెలు అందరికీ సమానంగా ఇవ్వాలి. ఇదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథు యొక్క స్పష్టమైన ఉద్దేశ్యం."

షరీఅహ్‌కు విరుద్ధంగా ఉండే తీర్పులు, నిర్ణయాలు చెల్లవు మరియు అమల్లోకి రావు.

"ఒక పాలకుడు లేదా ముఫ్తీ, తనకు స్పష్టంగా తెలియని విషయాల గురించి అదనపు విచారణ చేయాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రశ్న 'మీరు మీ పిల్లలందరికీ ఇలాగే చేసారా?' అనేది ఈ సూత్రానికి ఆధారం."

ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఈ హదీథు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన బహుమతిని తిరిగి వెనక్కి తీసుకునే అనుమతిని సూచిస్తున్నది."

"సోదరసోదరీమణులు మధ్య సామరస్యాన్ని పెంపొందించే పనులు చేయాలని మరియు వారి మధ్య శత్రుత్వాన్ని లేదా తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు దారితీసే పనులు నివారించాలని ఇస్లామ్ ఆదేశిస్తుంది."

التصنيفات

సంతానంపై ఖర్చు చేయటం