: . .

ఇమ్రాన్ ఇబ్నె హుసైన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి: "అస్సలాము అలైకుం" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చినారు, ఆ తరువాత ఆ వ్యక్తి కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "పది" అన్నారు. ఆ పిదప మరొకతను వచ్చి: "అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహ్" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇవ్వగా, ఆ వ్యక్తి కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ఇరవై" అన్నారు. ఆ తరువాత మరొకరు వచ్చి: "అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇవ్వగా, ఆ వ్యక్తి కూడా కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ముప్పై" అన్నారు.

[ప్రామాణికమైనది]

الشرح

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక)" అని అన్నాడు: దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతడు కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "అతడి కోసం పది పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. తరువాత మరొకరు వచ్చి "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ శాంతి, దయ కలుగుగాక)" అని అన్నాడు: దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతను కూర్చుకున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "అతడి కోసం ఇరవై పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. ఆ తరువాత మరొకరు వచ్చి "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు" (మీపై అల్లాహ్ శాంతి, కరుణ మరియు దీవెనలు కలుగుగాక) అని అన్నాడు. దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతడు కూడా కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "అతడి కోసం ముప్ఫై పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. అంటే, సలాము అభివాదంలోని ప్రతి పదానికి పది పుణ్యాలు లెక్కించబడతాయి అన్నమాట.

فوائد الحديث

కొత్తగా అక్కడికి వచ్చిన వ్యక్తి, అప్పటికే అక్కడ కూర్చుని ఉన్న వారికి సలాం చేయడం ద్వారా వారిని పలకరించడం ప్రారంభించాలి.

సలాము అభివాదంలోని పదాలు పెరిగే కొద్దీ దాని ప్రతిఫలం కూడా పెరుగుతుంది.

ఎవరినైనా సలాము అభివాదం చేసే అత్యంత పరిపూర్ణమైన పద్ధతి ఏమిటంటే, "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు" అని పలకడం (అంటే మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు దీవెనలు కురుయుగాక అని అనడం), మరియు దానికి ఉత్తమ ప్రతిస్పందన ఏమిటంటే: "వాలైకుమ్ అస్సలామ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు" (అంటే మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు దీవెనలు కురుయుగాక అని జవాబివ్వడం).

సలాము అభివాదము మరియు దాని ప్రతిస్పందన వివిధ స్థాయిలను కలిగి ఉంటాయి మరియు దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా మారుతూ ఉంటుంది.

ప్రజలకు మంచి విషయాలను నేర్పించడం, ఇంకా దాని కంటే మంచి దానిని కోరుకునే వైపు వారి దృష్టిని ఆకర్షించడం అనేది చాలా గొప్ప ఇస్లామీయ గుణము.

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: సలాం ప్రారంభించిన వ్యక్తి, "వ రహ్మతుల్లాహ్" (అల్లాహ్ యొక్క దయ) అని చేరిస్తే, సమాధానంగా "వ బరకాతుహూ" (ఆయన ఆశీర్వాదాలు) అని చేర్చడం ముస్తహబ్ (సిఫార్సు చేయబడినది). అయితే, "సలాం ప్రారంభించిన వ్యక్తి, "వ బరకాతుహూ" (ఆయన ఆశీర్వాదాలు) అని కూడా చేరిస్తే, సమాధానంలో ఇంకా అదనంగా ఏదైనా చేర్చవచ్చా? అలాగే, సలాం ప్రారంభించిన వ్యక్తి, "వ బరకాతుహూ"కి మించి ఇంకేదైనా చేరిస్తే, అలా అదనంగా చేర్చడం అనేది అనుమతించబడిందా?" ఇమాం మాలిక్ రహిమహుల్లాహ్ తన మువత్తాలో, ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన నుండి ఇలా తెలిపినారు: "సలాం యొక్క ముగింపు 'బరకహ్' (ఆశీర్వాదం) వద్ద ముగిస్తుంది."

التصنيفات

సలాంచేసే మరియు అనుమతి కోరే పద్దతులు