ప్రవక్త అనుచరుల ఘనత రజిఅల్లాహు అన్హుమ్

ప్రవక్త అనుచరుల ఘనత రజిఅల్లాహు అన్హుమ్

4- “నిశ్చయంగా, అల్లాహ్‌ను మరియు అతని ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి నేను ఈ జెండా ఇస్తాను మరియు అల్లాహ్ అతని చేతుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు”*. ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నాయకత్వం కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు, ఆ రోజు తప్ప”. ఆయన ఇంకా ఇలా అన్నారు: "(ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్నే పిలుస్తారు అనే ఆశతో) నేను దాని కోసం పిలువబడతాను అనే ఆశతో, వారి దృష్టిలో పడేలా నేను అటూ ఇటూ తిరుగసాగాను.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను పిలిపించి, ఆ జెండాను ఆయన చేతికి ఇచ్చి, ఇలా అన్నారు: “(ఓ అలీ!) ముందుకు సాగు, అల్లాహ్ నీకు విజయాన్ని ప్రసాదించే వరకు వెనుకకు చూడకు”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “అలీ ముందుకు కదిలాడు, కొద్ది దూరంలో ఆగి, వెనుకకు తిరగకుండా, గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్! నేను ఏ విషయంపై ఆ ప్రజలతో పోరాడాలి?”; దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప వెరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యమిచ్చే వరకు వారితో పోరాడు. వారు ఒకవేళ అలా చేసినట్లయితే వారి రక్తము మరియు సంపదలు నీ కొరకు ఉల్లంఘించరానివి (హరాం) అవుతాయి - షరియత్ ప్రకారం అలా చేయవలసి వస్తే తప్ప; మరియు వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది.”

5- “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు ను గురించి (అతడు చాలా కాలంగా కనిపించకపోవడంతో) వాకబు చేసినారు. అక్కడ ఉన్న వారిలో ఒకతను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మీకొరకు అతడిని గురించి తెలుసుకుని వస్తాను” అని పలికి, అతని (సాబిత్ బిన్ ఖైస్) వద్దకు వెళ్ళాడు. సాబిత్ బిన్ ఖైస్ తన ఇంటిలో తలను క్రిందకు వేలాడదీసుకుని (విచారములో మునిగిపోయినట్లుగా) కూర్చుని ఉండుట గమనించి “విషయం ఏమిటి” అని అడిగాడు. దానికి అతడు “కీడు” అన్నాడు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షములో వారి స్వరానికి మించి పై స్థాయిలో మాట్లాడేవాడు. కనుక తన సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, వ్యర్థమై పోయాయి, తానింక నరకవాసులలోని వాడై పోయాడు (అని బాధపడసాగినాడు). ఆ వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళి ‘అతడు ఇలా ఇలా అన్నాడు’ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారమిచ్చినాడు. తర్వాత ఆ వ్యక్తి సాబిత్ వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అమోఘమైన శుభవార్తతో తిరిగి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “@అతని వద్దకు వెళ్ళు, వెళ్ళి ‘నీవు నరకవాసులలోని వాడవు కావు, నీవు స్వర్గవాసులలోని వాడవు” అని అతనికి చెప్పు.”

7- "మీలో ఉత్తములు నా తరం వారు (సహాబాలు), తర్వాత వారిని అనుసరించే వారు (తాబియీన్), తర్వాత వారిని అనుసరించే వారు (అతబ్బ తాబియీన్)."* ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు తరాలను గురించి చెప్పారా లేక మూడు తరాలను గురించి చెప్పారా అనే విషయం నాకు స్పష్టంగా గుర్తు లేదు." ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మీ తర్వాత కొంతమంది ప్రజలు వస్తారు – వారు విశ్వసిస్తారు, కానీ నమ్మదగినవారు కారు; వారు సాక్ష్యం చెబుతారు, కానీ వారిని సాక్షిగా అడగరు; వారు ప్రతిజ్ఞ చేస్తారు, కానీ నెరవేర్చరు; వారి మధ్య మోటుదనం (అధిక బరువు/సుఖ జీవనం) విస్తరించి, లావుగా ఉంటారు."