మనస్సుల పరిశుద్ధత

మనస్సుల పరిశుద్ధత

1- “నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది*. మరియు ఆ రెంటికి మధ్య ఉన్నవి సందిగ్ధ విషయాలు. వాటి గురించి ప్రజలలో చాలా మందికి (సరియైన) ఙ్ఞానము లేదు. ఎవరైతే సందిగ్ధ విషయాల నుండి దూరంగా ఉన్నాడో అతడు, తన ధర్మాన్ని గురించి బాధ్యతను మరియు తన గౌరవాన్ని స్పష్ట పరుచుకున్నాడు. మరియు ఎవరైతే సందిగ్ధ విషయాలలో పడిపోయాడో అతడు – ప్రవేశం నిషేధించబడిన పొలం గట్టున పశువులను మేపుతున్న పశువుల కాపరి యొక్క పశువులు, ఏదో క్షణంలో పొలం లోనికి వెళ్ళి పోయినట్లుగా – అతడు ‘హరామ్’ లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుగారికి ఒక రక్షిత పొలం (భూమి) ఉంటుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క రక్షిత పొలం (భూమి) ఏమిటంటే, ఆయన నిషేధించిన విషయాలు. మరియు గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముద్ద ఉన్నది. అది ఆరోగ్యవంతంగా ఉంటే, మిగతా శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ అది కలుషితమై పోతే (చెడిపోతే) శరీరం మొత్తం కలుషితమై పోతుంది. అదే అతడి ‘గుండె’.

2- “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి*, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.

8- “ఒక మనిషి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురుగా కూర్చుని ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్ ! సల్లల్లాహు అలైహి వసల్లం నా దగ్గ ఇద్దరు బానిసలు ఉన్నారు. వారు నాతో అబద్ధాలు ఆడతారు, నన్ను మోసం చేస్తారు, మరియు నా పట్ల అవిధేయతతో ప్రవర్తిస్తారు. అందుకని నేను వారిని తిట్టే వాడిని, కొట్టే వాడిని. మరి వారికి సంబంధించి (తీర్పు దినమున) నా విషయము ఏమిటి (ఏమి కానున్నది)? దానికి ఆయన ఇలా అన్నారు: “@ నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి*. నీ శిక్ష మరియు వారి పాపాలు సమానంగా ఉంటే, ఇద్దరూ సమానంగా పరిగణించబడతారు. అందులో నీ కొరకు ఏమీ లేదు వారికి వ్యతిరేకంగా కూడా ఏమీ ఉండదు. అలాగే నీ శిక్ష వారి పాపాల కంటే ఎక్కువ మోతాదులో ఉంటే, నీ పుణ్యాలలో నుండి కొన్నింటిని నీ నుండి తీసుకుని వారికి ఇవ్వబడతాయి. ఆ మనిషి అక్కడి నుండి లేచి (బయటకు) వెళ్ళిపోయాడు. అక్కడ గట్టిగా ఏడవసాగాడు, దు:ఖించసాగాడు. అది చూసి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో “అల్లాహ్ తన దివ్య గ్రంథములో (ఖుర్’ఆన్ లో) ఏమని అంటున్నాడో నీవు చదవాలి {మరియు పునరుత్థానదినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్కచూడటానికి మేమే చాలు!} (సూరాహ్ అల్ అంబియా 21:47). అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారి నుంచి విడిపోవడమే వారిద్దరికీ మరియు నాకూ మంచి చేకూర్చే విషయం. మీరు సాక్ష్యంగా ఉండండి ఆ ఇద్దరు బానిసలను విముక్తి చేస్తున్నాను. ఇక నుండి వారిద్దరూ స్వతంత్రులు”.

12- "ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ* ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"