మాసూర్ దుఆలు

మాసూర్ దుఆలు

1- “ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి”. దానికి ఆయన “ ‘అల్-ఆఫియహ్’(క్షేమము, శ్రేయస్సు, సుస్థితి, ఆరోగ్యము మొ.) ప్రసాదించమని అర్థించు” అన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి” అని అడిగాను. దానికి ఆయన: “@ఓ అబ్బాస్, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, ఈ ప్రపంచములోనూ మరియు పరలోకములోనూ “ఆఫియహ్” ప్రసాదించమని అర్థించు” అన్నారు.”

2- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచుగా ఇలా దుఆ చేస్తూ ఉండేవారు “యా ముఖల్లిబల్ ఖులూబ్, సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్” (ఓ హృదయాలను త్రిప్పివేసేవాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై దృఢంగా ఉండేలా చేయి)*. నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! మేము మిమ్మల్ని విశ్వసించినాము, మరియు మీరు ఏ సందేశమునైతే తెచ్చినారో దానిని విశ్వసించినాము. మీరు మా గురించి భయపడుతున్నారా?” దానికి ఆయన “అవును, (ఎందుకంటే) హృదయాలు అల్లాహ్ చేతి రెండు వేళ్ళమధ్య ఉంటాయి. ఆయన వాటిని తన చిత్తము వచ్చిన వైపునకు మరల్చుతాడు” అన్నారు.”

3- “అల్లాహుమ్మ అస్లిహ్’లీ దీనీ అల్లదీ హువ ఇస్మతు అమ్రీ*; వ అస్లిహ్’లీ దున్యాయా, అల్లతీ ఫీహా మఆషీ; వ అస్లిహ్’లీ ఆఖిరతీ, అల్లతీ ఫీహా మఆదీ; వ అజ్’అలిల్ హయాత జియాదతన్’లీ ఫీ కుల్లి ఖైరిన్; వజ్’అలిల్ మౌత రాహతన్’లీ మిన్ కుల్లి షర్రిన్”; (ఓ అల్లాహ్! నా ధర్మాన్ని (నా ధర్మానుసరణను) నా కొరకు సరిచేయి - ఎందులోనైతే నా రక్షణ ఉన్నదో; మరియు నా ఈ ప్రపంచాన్ని సరిచేయి - ఎందులోనైతే నా జీవనం ఉన్నదో; మరియు శుభప్రదమైన ప్రతి దానిలోనూ నా జీవనాన్ని పొడిగించు; మరియు వినాశనాన్ని కలిగించే ప్రతి దానిలోనూ మరణాన్ని నాకు ప్రశాంతత కలిగించే దానిలా చేయి”.

5- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఉదయమూ ప్రతి సాయంత్రమూ ఈ దుఆ పఠించకుండా ఎప్పుడూ వదిలి వేయలేదు: @“అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి*, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ వల్ ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ, అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, అవ్: వ ఆమిన్ రౌఆతీ, అల్లాహుమ్మహ్’ఫజ్’నీ మింబైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వ అన్’యమీనీ, వ అన్’షిమాలీ, వమిన్ ఫౌఖీ; వ అఊదు బిఅజ్’మతిక అన్ ఉగ్’తాల మిన్ తహ్’తీ” (ఓ అల్లాహ్, నేను నిన్ను ఇహలోకంలో మరియు పరలోకంలో మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని కోరుతున్నాను; ఓ అల్లాహ్, నేను నిన్ను క్షమించమని మరియు నా ధర్మములో, నా ప్రాపంచిక జీవితంలో, నా కుటుంబంలో మరియు నా సంపదలో శ్రేయస్సు ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నా తప్పులను కప్పివేసి, నా భయాన్ని తగ్గించు; ఓ అల్లాహ్! నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి మరియు నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. మరియు నా క్రింద నుండి హఠాత్తుగా చంపబడకుండా నేను నీ ఘనతను, గొప్పతనాన్ని ఆశ్రయిస్తున్నాను.)

6- “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి కుల్లిహి, ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం; వ అఊజుబిక మిన్ షర్రి కుల్లిహి ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం*; అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక; వ అఊజుబిక మిన్ షర్రి మా అజాబిహి అబ్దుక వ నబియ్యుక; అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నత, వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్; వ అఊజుబిక మినన్నారి, వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్; వ అస్అలుక అన్’తజ్’అల కుల్ల ఖదాయిన్ ఖదైతహు లీ ఖైరన్”. (ఓ అల్లాహ్! నేను ప్రతి శుభాన్ని ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాను, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా; మరియు ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, వినాశం కలిగించే ప్రతి దాని నుండి నీ రక్షణ కోరుతున్నాను, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా; ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త నిన్ను కోరిన మంచి కొరకు నేను నిన్ను అడుగుతున్నాను మరియు నీ సేవకుడు మరియు ప్రవక్త శరణు కోరిన చెడు నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను, నీ రక్షణ కోరుతున్నాను; ఓ అల్లాహ్! నేను నిన్ను స్వర్గం కొరకు అడుగుతున్నాను, మరియు దానికి చేరువ చేసే మాటలు మరియు ఆచరణల కొరకు కూడా; నరకాగ్ని నుండి నీ రక్షణ కోరుతున్నాను మరియు దానికి చేరువ చేసే మాటలు మరియు ఆచరణలనుండి కూడా. మరియు (ఓ అల్లాహ్!) నీవు నా కొరకు నిర్ణయించిన ప్రతి ఉత్తర్వును, ప్రతి ఆదేశాన్ని, నా కొరకు మంచిదిగా చేయమని నేను నిన్ను అడుగుతున్నాను.)

7- “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక, వతహవ్వులి ఆ’ఫియతిక, వ ఫుజాఅతి నిఖ్’మతిక, వజమీఅ సఖతిక” (ఓ అల్లాహ్! (నా నుండి) నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి, మరియు (నాకు నీవు ప్రసాదించిన) సౌఖ్యము, క్షేమము మార్చివేయబడుట నుండి, మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చిపడే విపత్తు నుండి, మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.)

8- “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)

11- “ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! అల్లాహ్’ను స్మరిస్తూ ఉండడానికి నాకు ఏదైనా నేర్పించండి”. ఆయన ఇలా అన్నారు: @“నీవు ఇలా పలుకు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లాహు, అల్లాహు అక్బర్ కబీరా, వల్’హందులిల్లాహి కథీరా, సుబ్’హానల్లాహి రబ్బీల్ ఆ’లమీన్, లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అజీజిల్ హకీం”*; దానికి ఆ ఎడారివాసి “అవి నా ప్రభువు కొరకు, మరి నా కొరకు ఏమిటీ?” అని ప్రశ్నించాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకు అన్నారు: “అల్లాహుమ్మగ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వహ్’దినీ; వర్జుఖ్’నీ.”