వంశపు ధర్మశాస్త్ర జ్ఞానం

వంశపు ధర్మశాస్త్ర జ్ఞానం

13- “మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”

14- ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు వారిని కలవడం నుండి జాగ్రత్తగా ఉండండి”. అది విని అన్సారులలో నుండి ఒక వ్యక్తి “మరి “హమ్’వ” (భర్త తరఫు పురుష బంధువు) ను గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు. దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “హమ్’వ” అంటే మరణమే” అన్నారు

15- “ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు”

17- “తన వలీ (సంరక్షకుల) అనుమతి లేకుండా వివాహం చేసుకున్న స్త్రీ వివాహం చెల్లదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటలను మూడుసార్లు పలికినారు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఒకవేళ భర్త ఆమెతో సంబోగములో పాల్గొని ఉంటే, అతడు ఆమె నుండి ఏదైతే పొందినాడో, అందుకు గానూ ఆమెకు వరకట్నం లభిస్తుంది. వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, సుల్తాన్ (అధికారంలో ఉన్న వ్యక్తి, ఆ ఇద్దరిలో) సంరక్షకుడు ఎవరూ లేని వ్యక్తికి సంరక్షకుడు అవుతాడు.”

19- “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: “ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరి భార్యకైనా అతనిపై (ఆమె భర్తపై) ఉన్న హక్కు ఏమిటీ?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నువ్వు తిన్నపుడు ఆమెకు కూడా తినిపించు; ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయి - నీవు దుస్తులు ధరించినపుడు, లేదా నీవు డబ్బు సంపాదించినపుడు; ఆమె ముఖం పై ఎపుడూ కొట్టకు; ఆమెను ఎన్నడూ అవమానించకు; ఆమెను ఇంటిలో తప్ప ఇంకెక్కడా ఆమెను నీ నుండి వేరు చేయకు.”