పేర్లు మరియు ఆదేశాలు.

పేర్లు మరియు ఆదేశాలు.

4- మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా మీ విషములో నేను భయపడే విషయం ఏమిటంటే – మీరు చిన్న షిర్క్ కు పాల్బడతారేమోనని.” అక్కడ ఉన్న వారు ఇలా ప్రశ్నించారు “చిన్న షిర్క్ అంటే ఏమిటి ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం?” దానికి ఆయన “

9- “ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను కలుస్తాడో, అతడు స్వర్గం లో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్‘కు ఇతరులను సాటి కల్పిస్తున్న స్థితిలో అల్లాహ్ ను కలుస్తాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు”

12- “ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జోస్యము చెప్పించుకుంటాడో; లేదా ఎవరైతే చేతబడి చేస్తాడో, లేక చేతబడి చేయిస్తాడో; అలాంటి వాడు మాలోని వాడు కాడు

15- “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట

16- అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)

19- ఎవరైతే ఇస్లాంలో సత్కార్యాలు చేస్తారో వారు జాహిలియ్యహ్ కాలములో చేసిన వాటిలో దేనికీ జవాబుదారులుగా పట్టుకోబడరు. మరియు ఎవరైతే ఇస్లాంలో చెడుకు (పాపపు పనులకు) పాల్బడుతారో వారు తమ పూర్వపు మరియు ప్రస్తుత జీవితపు పాపపు పనులకు జవాబు దారులుగా పట్టుకోబడతారు” అన్నారు

20- నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే)

26- “శకునములను విశ్వసించుట ‘షిర్క్’ (బహుదైవారాధన); శకునములను విశ్వసించుట ‘షిర్క్’; శకునములను విశ్వసించుట ‘షిర్క్’ అని మూడు సార్లు అన్నారు. మరియు మనలో ప్రతి ఒక్కరూ దానిని ఎంతో కొంత అనుభవించిన వారమే; అయితే సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తనపై ఉంచిన భరోసా ద్వారా దానిని తొలగిస్తాడు.”

29- “అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కపట విశ్వాసి తప్ప వారిని ఎవరూ ద్వేషించరు. వారిని (అన్సారులను) ఎవరైతే ప్రేమిస్తారో, అల్లాహ్ అతడిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే వారిని ద్వేషిస్తాడో అల్లాహ్ అతడిని ద్వేషిస్తాడు.”

42- మీ ప్రభువు ఏమని అన్నాడో తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే తెలుసును” అని జవాబిచ్చారు. దానికి ఆయన “అల్లాహ్ ఇలా అన్నాడు “నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసిస్తూ (విశ్వాసులుగా) ఈనాటి ఉదయంలోనికి ప్రవేశించినారు, మరియు మరికొందరు అవిశ్వాసులుగా ప్రవేశించినారు

43- (ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు

44- “మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”

56- “నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”