ఫిఖ్ మరియు దాని నియమాలు - الصفحة 2

ఫిఖ్ మరియు దాని నియమాలు - الصفحة 2

18- “మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”

19- ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు వారిని కలవడం నుండి జాగ్రత్తగా ఉండండి”. అది విని అన్సారులలో నుండి ఒక వ్యక్తి “మరి “హమ్’వ” (భర్త తరఫు పురుష బంధువు) ను గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు. దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “హమ్’వ” అంటే మరణమే” అన్నారు

20- “బంగారానికి బదులుగా వెండి అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; అలాగే గోధుమలకు బదులుగా గోధుమలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; బార్లీ గింజలకు బదులుగా బార్లీ గింజలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది.”

21- “నీ శరీరంలో ఏభాగములోనైతే నొప్పి పెడుతున్నదో దానిపై నీ చెతిని ఉంచు, తరువాత “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామముతో) అని మూడుసార్లు పఠించు; తరువాత ఏడుసార్లు “అఊదుబిల్లాహి, వ ఖుద్రతిహి మిన్ షర్రిమా అజిదు వ ఉహాదిర్” అని పఠించు” (నేను అనుభవిస్తున్న మరియు భయపడుచున్న చెడు మరియు కీడు నుండి నేను అల్లాహ్ ద్వారా మరియు ఆయన శక్తి ద్వారా శరణు వేడుకుంటున్నాను) అన్నారు

24- “ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”

25- “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”

26- “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”

36- “ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు”

42- “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది

47- “ఎవరైతే (ప్రతిరోజూ విధిగా ఆచరించ వలసిన) ప్రతి నమాజు తరువాత ముప్ఫై మూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్’హందులిల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్లాహు అక్బర్” అని ఉచ్ఛరిస్తాడో, అవి మొత్తం తొంభైతొమ్మిది అవుతాయి”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “వాటిని “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్దు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” అని ఉచ్ఛరించి మొత్తం వందగా పూర్తి చేస్తాడో, అతని పాపాలన్నీ క్షమించివేయబడతాయి, అవి సముద్రపు నురగ అంత అధికంగా ఉన్నా సరే.”

49- “మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి తెలియకపోతే – అతడు తన సందేహాన్ని (ప్రక్కకు) విసిరేసి, ఖచ్చితంగా ఎన్ని రకాతులు పూర్తి అయినాయని విశ్వసిస్తున్నాడో, దానిపై తన నమాజు ను ఆధారం చేసుకుని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పే ముందు (సలాంతో నమాజు పూర్తి చేసే ముందు) రెండు సజ్దాలు చేయాలి

57- “తన వలీ (సంరక్షకుల) అనుమతి లేకుండా వివాహం చేసుకున్న స్త్రీ వివాహం చెల్లదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటలను మూడుసార్లు పలికినారు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఒకవేళ భర్త ఆమెతో సంబోగములో పాల్గొని ఉంటే, అతడు ఆమె నుండి ఏదైతే పొందినాడో, అందుకు గానూ ఆమెకు వరకట్నం లభిస్తుంది. వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, సుల్తాన్ (అధికారంలో ఉన్న వ్యక్తి, ఆ ఇద్దరిలో) సంరక్షకుడు ఎవరూ లేని వ్యక్తికి సంరక్షకుడు అవుతాడు.”

60- “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: “ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరి భార్యకైనా అతనిపై (ఆమె భర్తపై) ఉన్న హక్కు ఏమిటీ?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నువ్వు తిన్నపుడు ఆమెకు కూడా తినిపించు; ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయి - నీవు దుస్తులు ధరించినపుడు, లేదా నీవు డబ్బు సంపాదించినపుడు; ఆమె ముఖం పై ఎపుడూ కొట్టకు; ఆమెను ఎన్నడూ అవమానించకు; ఆమెను ఇంటిలో తప్ప ఇంకెక్కడా ఆమెను నీ నుండి వేరు చేయకు.”

81- “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”