సద్గుణాలు మరియు పద్దతులు - الصفحة 3

సద్గుణాలు మరియు పద్దతులు - الصفحة 3

1- “(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది

4- ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” అని ప్రశ్నించినారు. అపుడు నేను “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా గుండెలపై తట్టి “అల్లాహ్ ఙ్ఞానాన్ని నీ కొరకు ఆహ్లాదకరమైనదిగా చేయుగాక ఓ అబుల్ ముందిర్!” అన్నారు”

12- “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”

15- “నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”

35- అల్లాహ్ మీకు కూడా అలా దానం చేసే అవకాశం ఇవ్వలేదు అని భావిస్తున్నారా? ప్రతిసారి 'సుబహానల్లాహ్' (అల్లాహ్ పరమ పవిత్రుడు) అని ధ్యానం చేయడమూ దానమే, ప్రతిసారి 'అల్లాహు అక్బర్' (అల్లాహ్ గొప్పవాడు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'అల్‌హమ్దులిల్లాహ్' (అల్లాహ్‌కే సకల స్తుతులు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అని పలకడమూ దానమే. మంచి పనిని ప్రోత్సహించడమూ దానమే, చెడు పనిని నిషేధించడము కూడా దానమే. ఇంతేకాదు, మీలో ఎవరు తమ శారీరక కోరికను హలాల్ మార్గంలో తీరుస్తారో, వారికి దాని పుణ్యమూ లభిస్తుంది." అప్పుడు సహాబాలు ఆశ్చర్యపడి, "ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరు తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?

41- ఎవరైనా ముస్లిం పాపం లేదా బంధుత్వాన్ని తెంచే వేడుకోలు లేని దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా అతనికి మూడు విషయాల్లో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అతని దుఆను వెంటనే నెరవేర్చుతాడు, లేదా దుఆకు బదులుగా అతనికి పరలోకంలో పుణ్యాలు ప్రసాదించబడేందుకు ఆపుతాడు, లేదా ఆ దుఆ స్థాయిలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగిస్తాడు." అప్పుడు సహాబాలు అడిగారు: "అయితే మేము ఎక్కువగా దుఆ చేస్తాం!" దానికి ప్రవక్త ﷺ అన్నారు: "అల్లాహ్ మరింత ఎక్కువగా (ఇస్తాడు)

42- అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కష్టకాలంలో ఇలా పలికేవారు: "లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్ అజీముల్ హలీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుల్ అర్షిల్ అజీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుస్సమావాతి వ రబ్బుల్ అర్ది, వ రబ్బుల్ అర్షిల్ కరీమ్ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహాన్నతుడు, మహాసహనశీలుడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహా సింహాసనానికి అధిపతి. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఆకాశాలకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు ఘనమైన సింహాసనం యొక్క అధిపతి)

45- ‘ఒక ముస్లింకి మరొక ముస్లిం పై ఆరు హక్కులు ఉన్నాయి. ‘ఒకటి అతన్ని కలిసినప్పుడు సలాం చేయాలి, రెండు : అతను నిన్ను ఆహ్వానించినప్పుడు దాన్ని స్వీకరించాలి. మూడు : అతను నిన్ను సలహా కోరితే అతనికి మేలైన సలహా ఇవ్వాలి. నాలుగు : తుమ్మినప్పుడు అల్హందులిల్లాహ్ పలికితే దానికి యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పాలి. ఐదు : అతను జబ్బు పడినప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు వెళ్ళి పరామర్శించాలి. ఆరు : చనిపోయినప్పుడు అతని జనాజా వెంట వెళ్ళాలి

59- గాలిని దూషించకండి (తిట్టకండి). మీకు ఇష్టము లేని గాలి (ఉదాహరణకు — బలమైన తుఫాను, గాలి దుమారము వంటిది) చూస్తే, ఇలా వేడుకోండి: ‘ఓ అల్లాహ్! ఈ గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకొచ్చే మంచి కోసం, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన మంచి కోసం మేము నిన్ను వేడు కుంటున్నాము. ఈ గాలిలో ఉన్న దుష్టత (చెడుల) నుండి, అది తీసుకొచ్చే చెడు నుండి, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన చెడు నుండి మేము నీ శరణు వేడు కుంటున్నాము

61- నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ముక్కుమీద మట్టి కొట్టుకు పోవుగాక! అతడి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నా, వారు అతడిని స్వర్గంలో ప్రవేశింపజేయకపోతే (వారికి సేవలు చేయడం ద్వారా పుణ్యాలు సంపాదించి స్వర్గంలో ప్రవేశం పొందలేకపోయిన), ఆ వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక!